రాజన్నసిరిసిల్ల: సిరిసిల్లలో శుక్రవారం ఉదయం టిప్పర్ బీభత్సం సృష్టించింది. బైక్, ఆర్టిసి బస్సును టిప్పర్ ఢీకొట్టడంతో ఒకరు దుర్మరణం చెందారు. ఈప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను సిరిసిల్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.