బైక్ అదుపు తప్పి యువకుని మృతి

నారాయణపేట: బైక్‌పై ప్రయాణిస్తుండగా బైక్ అదుపు తప్పి క్రింద పడిన ఘటనలో యువకుడు మృతి చెందగా, ఇంకొక యువకునికి గాయాలయిన సంఘటన ఆదివారం రాత్రి పట్టణ శివారులో చోటు చేసుకుంది. ఎస్సై కృష్ణయ్య కథనం మేరకు… కర్నాటక రాష్ట్రం నసలవాయి గ్రామానికి చెందిన భీంసేన్‌రావు పట్టణంలో నివాసముంటున్నాడు. భీంసేన్ రావు కుమారుడు శ్రీనివాసరావు(17) ఆదివారం అర్ధరాత్రి సమయంలో భైరంకొండ గ్రామం నుండి పేట వైపుకు తన స్నేహితుడు రమేష్‌తో కలిసి బైక్ పై వస్తున్నాడు. ఈ క్రమంలో […]

నారాయణపేట: బైక్‌పై ప్రయాణిస్తుండగా బైక్ అదుపు తప్పి క్రింద పడిన ఘటనలో యువకుడు మృతి చెందగా, ఇంకొక యువకునికి గాయాలయిన సంఘటన ఆదివారం రాత్రి పట్టణ శివారులో చోటు చేసుకుంది. ఎస్సై కృష్ణయ్య కథనం మేరకు… కర్నాటక రాష్ట్రం నసలవాయి గ్రామానికి చెందిన భీంసేన్‌రావు పట్టణంలో నివాసముంటున్నాడు. భీంసేన్ రావు కుమారుడు శ్రీనివాసరావు(17) ఆదివారం అర్ధరాత్రి సమయంలో భైరంకొండ గ్రామం నుండి పేట వైపుకు తన స్నేహితుడు రమేష్‌తో కలిసి బైక్ పై వస్తున్నాడు. ఈ క్రమంలో పట్టణ శివారులోని ఎర్రగుట్ట వద్ద వారు వస్తున్న బైక్ అదుపు తప్పి క్రింద పడింది. అదే సమయంలో భైరంకొండ వైపు నుండి పేట వైపుకు వస్తున్న 108 వాహనం సిబ్బంది జరిగిన ప్రమాదాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. అంతేకాకుండా అదే అంబులెన్స్‌లో క్షతగాత్రులను పేట ఆసుపత్రికి తీసువచ్చారు. విషయం తెలుసుకున్న శ్రీనివాసరావు తండ్రి భీంసేన్ రావు ఆసుపత్రికి రాగ అప్పటికే కుమారుడు మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. గాయాలయిన రమేష్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రానికి తరలించారు. భీంసేన్ రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ కృష్ణయ్య తెలిపారు.

Related Stories: