బుల్ రికార్డ్ జంపు

 Sensex zooms 442 points to close at a record 38694

రికార్డు స్థాయిని తాకిన నిఫ్టీ
442 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

న్యూఢిల్లీ : బుల్ మరో పెద్ద జంప్ చేసింది. కొద్ది రోజులుగా రికార్డుల మీద రికార్డులతో స్టాక్‌మార్కెట్ సూచీలు దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో సోమవారం మార్కెట్లు ప్రారంభం నుంచే జోరును చూపాయి. కొనుగోళ్ల దన్నుతో సూచీలు పైపైకి ఎగిశాయి. దీంతో సెన్సెక్స్ భారీగా 442 పాయింట్లు లాభపడి 38,694 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 134 పాయింట్లు పెరిగి 11,692 పాయింట్ల వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయ మార్కెట్లో బుల్ అదరగొట్టింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఫైనాన్స్ షేర్లలో కొనుగోళ్లు వెళ్లువెత్తడంతో సూచీలు సరికొత్త రికార్డుస్థాయికి చేరాయి. ఒకేరోజు ఇంతటి స్థాయికి సూచీలు చేరడం చరిత్రలో ఇదే.. ఇంట్రాడేలో నిఫ్టీ సూచీ 10,701 వద్ద, సెన్సెక్స్ 38,736.88 వద్ద తమ కొత్త జీవితకాల గరిష్టాలను నమోదుచేశాయి.

సెన్సెక్స్ సూచీ 38,416 నుంచి 38,736 పాయింట్ల మధ్య శ్రేణిలో కదలాడింది. నిప్టీ సూచీ 11,595 నుంచి- 11,701 పాయింట్ల మధ్య స్థాయిలో కదలాడింది. ఎన్‌ఎస్‌ఇలోని కీలక అన్ని రంగాలకు చెందిన సూచీలన్నీ లాభపడ్డాయి. ప్రభుత్వరంగ బ్యాంకు సూచీ అత్యధికంగా 2.66 శాతం శాతం పెరిగింది. నిఫ్టీ బ్యాంకు 1.54 శాతం (430 పాయింట్లు) లాభపడి 28,264 వద్ద ముగిసింది. ప్రపంచమార్కెట్లో నెలకొన్న సానుకూల పరిస్థితులు,. అమెరికా ఫెడరల్ రిజర్వు ఛైర్మన్ వడ్డీ రేట్లపై మెతక వైఖరి, ఆగస్ట్‌లో విదేశీపోర్ట్‌ఫోలియో నిధుల ప్రవాహం, డాలర్ మారకంలో రూపాయి కోలుకోవడం వంటి సానుకూల సంకేతాలతో సూచీలు ఉత్సాహంగా పరుగులు పెట్టాయి. సూచీల్లో ప్రధాన వెయిటేజ్ ఉన్న బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆర్థిక రంగాలకు చెందిన షేర్లు లాభాల బాటపట్టాయి. ప్రధానంగా ఐసిఐసిఐ బ్యాంకు, టెక్‌మహీంద్రా, పవర్‌గ్రిడ్, భారతీ ఎయిర్‌టెల్, హిందాల్కో షేర్లు 3 నుంచి 4శాతం లాభపడ్డాయి. డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఫిన్ సర్వీసెస్, సన్‌ఫార్మా షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.

ఐటి, మెటల్, బ్యాంక్ అంతర్జాతీయ మార్కెట్లు ఉత్సాహం తో ఉండడంతో సెంటిమెంట్ బలపడింది. ప్రధానంగా ఐటి, మెటల్, బ్యాంక్ నిఫ్టీ 2 శాతం చొప్పున పెరగడంతో మార్కెట్లకు జోష్ వచ్చింది. అమెరికాసహా, ఆసియా, యూరోపియన్ స్టాక్ మార్కెట్లలోనూ కొనుగోళ్లదే పైచేయిగా నిలవడం దేశీయంగా సానుకూలం ప్రభావం చూపింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సూచీలు మరోసారి సరికొత్త రికార్డులను అందుకున్నాయి.

మిడ్, స్మాల్ క్యాప్: మార్కెట్లకు అనుగుణంగానే బిఎస్‌ఇ మిడ్, స్మాల్ క్యాప్‌లు లాభాలను నమోదు చేశాయి. దాదాపు 1 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1140 లాభపడగా, 1569 నష్టాలతో ముగిశాయి.

దేశీయ ఇన్వెస్టర్లు: గతవారం ముగింపు రోజు శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐలు) పెద్దగా కొనుగోళ్లు చేపట్టలేదు. అయితే రూ. 76 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. మరోవైపు దేశీ ఫండ్స్(డిఐఐలు) మాత్రం రూ. 905 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి.

రకోపరగా్రరగా్