బురుద మయంగా మానుకోట ఆర్టీసి బస్టాండ్

Passengers Facing Problem In Mahabubabad Bus Stand
మనతెలంగాణ/మహబూబాబాద్ టౌన్: చినుకు పడితే చాలు …అంతా చిత్తడిగా మారి ప్రయాణికులకు ఇబ్బందిగా మారుతుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మానుకోట జిల్లా కేంద్రంలోని ఆర్టీసి బస్టాండ్ అంత నీటితో నిండి బస్సులకు ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తుంది. జిల్లా కేంద్రంగా మారిన బస్టాండ్ ఆవరణ తీరు మారక పోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షా కాలంలో ప్రయాణికులకు మానుకోట ఆర్టీసి బస్టాండ్ నుండి ప్రయాణం చేయాలంటేనే నరక యాతనంగా ఉంటుంది. అనేక మంది ప్రయాణికులు బస్టాండ్ ఆవరణంలోని బురుదలో జారి పడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇక్కడి బస్టాండ్ నుండి హైదరాబాద్, సూర్యపేట, ఖమ్మం, ఇల్లందు, వేములవాడ, కరీంనగర్, తొర్రూర్, భద్రాచలం కు అనేక ఆర్టీసి బస్సులు, ఇతర వాహానాలు వెలుతూంటాయి. అంతేకాక ఇతర ప్రాంతాల డిపో బస్సులు కూడా ఈ బస్టాండ్‌కు చేరుకుని పోవల్సిందే.. అనేక మంది ఇక్కడి నుండి ప్రయాణం చేస్తుంటారు. ఇప్పుడు మానుకోట జిల్లాగా ఏర్పాటు కావడంతో మరింత ప్రయాణికుల రద్ది పెరిగింది. ఐనా బస్టాండ్ తీరు మారలేదనే ఆవేదనలు ప్రయాణికులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన అధికారులు, ప్రజాప్రతినధులు బస్టాండ్ తీరును మార్చాలని ప్రయాణికులు కోరుతున్నారు.
పట్టంచుకోని వైణం..
జిల్లా కేంద్రమైన మానుకోట ఆర్టీసి బస్టాండ్ ను పట్టించుకునే నాదుడు కరువయ్యారు. ఇక్కడ జిల్లా కలెక్టర్ తో పాటు, జిల్లా ఉన్నతాధికారులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ఉన్నప్పటికి బురుద మయ్యంగా ఉన్న బస్టాండ్‌ను పట్టింకున్న పాపానపోలేదు.. అనేక సంవత్సరాలనుండి ఇక్కడి నుండి ప్రయాణం చేసే ప్రయాణికులకు తిప్పలు తప్పడంలేదు.. ఆదాయం ప్రభుత్వానికి వస్తున్నపట్టికి బస్టాండ్ పట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్షం చూపుతున్నారని విమర్శలోస్తున్నాయి. ఇప్పటికైన స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు మానుకోట బస్టాండ్ అభివృద్ది పరిచి సుందరీకరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో బస్టాండ్ బురుదలో వరి నాట్లు..
బురుద మయంగా మారిన మానుకోట బస్టాండ్ ప్రాగాణంలో తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో ఆదివారం వరి నాట్లు నాటారు. ఈ సందర్బంగా జిల్లా సమన్వయకర్త డాక్టర్ డోలి సత్యనారాయణ మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ ఇస్టాండ్ లేదా.. అని ప్రశ్నించారు. అధికారుల, ప్రజాప్రతినిధుల నిర్లక్షం వలనే మానుకోట ఆర్టీసి బస్టాండ్ దుస్థితి ఇలా మారిందని ఆరోపించారు. తక్షణమే స్పందించి బస్టాండ్ అభివృధ్దికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పిల్లి సుధాకర్, మాలోత్ వెంకన్న, భూక్య సత్యనారాయణ, ఇరుగు మనోజ్, సుశీల, పద్మ, సుమతి, అనూష తదితరులు పాల్గొన్నారు.

Comments

comments