బుద్వేల్ వద్ద దారి దోపిడీ

Robbery at Budwel in Ranga reddy

రంగారెడ్డి : రాజేంద్రనగర్ బుద్వేల్ వద్ద బుధవారం రాత్రి దారి దోపిడీ జరిగింది. భార్గవి గ్యాస్ కంపెనీ క్యాషియర్ రాము రూ.6.7లక్షల నగదుతో బైక్‌పై వెళుతుండగా దుండగులు దాడి చేసి నగదును అపహరించారు. దుండగులను ప్రతిఘటించిన రాముకు తీవ్ర గాయాలయ్యాయి. రామును ఆస్పత్రికి తరలించారు. ఈ దారి దోపిడీ ఈ ప్రాంతంలో సంచలనమైంది. ఈ ఘటనపై రాము ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Robbery at Budwel in Ranga reddy