బుగ్గిపాలైన మిషన్ భగీరథ పైపులు…

Mission Bhagiratha Pipes Burning In Fire Accident

శంషాబాద్ ః లక్షల విలువైన మిషన్ భగీరథ పైపులు చూస్తుండగానే బుగ్గిపాలైన సంఘటన మంగళవారం ఉదయం శంషాబాద్ మండల కేంద్రంలోని రాళ్లగూడ గ్రామం వద్ద సర్వీస్ రోడ్డులో చోటు చేసుకుంది.స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తులు చెత్త కుప్పలో సిగరేట్ త్రాగి పారవేయడంతో చిన్న చిన్న మంటలు పెద్దగా అయి పక్కనే ఉన్న మిషన్ భగీరథ పైపులకు అంటుకున్నాయి. దీంతో స్ధానికుల సమాచారం మేరకు సంఘటన స్ధలానికి వచ్చిన ఆర్జీఐఏ మొబైల్ పోలీసులు వెంటనే రాజేంద్రనగర్‌లో ఉన్న అగ్నిమాపక సిబ్బందికి,స్ధానిక విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు సమాచారం ఇచ్చిన గంట తర్వాత అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్ధలానికి చేరుకున్నారు. దీంతో అప్పటికే దాదాపు తొంబై శాతం పైపులు అగ్నికి ఆహుతి అయినవి.ఇంకా ఎగిసిపడుతున్నా మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చి పూర్తిగా ఆర్పివేశారు.కానీ జరగల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది.

Comments

comments