బి ఫార్మసీ విద్యార్ధిని ఆత్మహత్య…

మేడ్చల్: తండ్రి మందలించడంతో బి ఫార్మసీ విద్యార్ధిని చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. సిఐ తెలిపిన వివరాల ప్రకారం… మండల పరిధిలోని చీర్యాల్ గ్రామానికి చెందిన ఆర్‌ఎంపి వైద్యుడు నిత్యానంద్ కూతురు సోని (24) గీతాంజలి కళాశాలలో బి ఫార్మసీ చివరి సంవత్సరం చదువుతుంది. చదువు విషయమై తండ్రి మందలించడంతో బుధవారం ఉదయం కళాశాల కని వెళ్లిన సోని పరీక్షలు రాయకుండా బ్యాగును తరగతి గధిలోనే […]

మేడ్చల్: తండ్రి మందలించడంతో బి ఫార్మసీ విద్యార్ధిని చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. సిఐ తెలిపిన వివరాల ప్రకారం… మండల పరిధిలోని చీర్యాల్ గ్రామానికి చెందిన ఆర్‌ఎంపి వైద్యుడు నిత్యానంద్ కూతురు సోని (24) గీతాంజలి కళాశాలలో బి ఫార్మసీ చివరి సంవత్సరం చదువుతుంది. చదువు విషయమై తండ్రి మందలించడంతో బుధవారం ఉదయం కళాశాల కని వెళ్లిన సోని పరీక్షలు రాయకుండా బ్యాగును తరగతి గధిలోనే ఉంచి వెళ్లింది. తండ్రి మందలించాడన్న మనస్థాపంతో చీర్యాల్ గ్రామంలోని నాత్కాన్ చెరువు వద్దకు వెళ్లి ‘ఐ యామ్ గోయింగ్ టు బై’ అని స్నేహితురాలికి మెసేజ్ పెట్టి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. తోటి విద్యార్ధులు సోని వదిలి వెళ్లిన బ్యాగును ఆమె తండ్రికి అందజేసి మెసేజ్ విషయం తెలిపారు. దీంతో గాబరా పడిన నిత్యానంద్ కీసర పోలీసులకు ఫిర్యాదు చేసి వివిధ ప్రాంతాలలో పోలీసులతో కలిసి రాత్రి వరకు సోని ఆచూకి వెతికిన ఫలితం లేకుండా పోయింది. గురువారం ఉదయం నాత్కాన్ చెరువులో యువతి మృతదేహం తెలియాడుతుండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో సోని మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీశారు. ఒక్కగానోక్క కూతురును ఎన్నో ఆశలతో అల్లారు ముద్దుగా పెంచితే మిగత జీవిగా మారిందని తల్లిదండ్రులు బీరున విలపించారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు సిఐ సురేందర్ గౌడ్ తెలిపారు.

Related Stories: