బిసిల అభ్యున్నతి ప్రభుత్వం కృషి

The Government is working hard to progress is BC

మనతెలంగాణ/ముథోల్ : బీసీల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని అటవీ,బీసీ సంక్షేమ శాఖమంత్రి జోగురామన్న అన్నారు. మండలంలోని తరోడ గ్రామంలో జెడ్పీటీసీ   లక్ష్మీనర్సాగౌడ్ నివాసంలో సో మవారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం బీసీల అభివృద్ధికి అనేకసంక్షేమ పథకాలను ప్రవేశఫేట్టిందన్నారు. బీసీలు ఆర్థికంగా ఎదగడానికి భ్యాంక్ లీంకేజీలు లేకుండా ప్రభుత్వం రుణాలను అందజేస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఇప్పటికే బీసీలకు  ఎన్నొ రుణాలను కేటాయించిందన్నారు. రూ. 1700కోట్లతో బీసి ,ఎంబీసీ సంచార జాతుల అభివృద్ధికోసం కేటాయిందన్నారు. నేరుగా  రూ. 50వేల నుండి రూ. 2లక్షాల వరకు రుణాలను లబ్దిదారులకు బ్యాంక్‌తో సంబంధం లేకుండా అందజేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం కుల వృత్తులు,వ్యాపారంలో బీసీలు రాణించడానికి ఆర్థిక చేయూత ను ఇస్తుందన్నారు. ఏరాష్ట్రంలో లేని విధంగా అనేక పథకాలను ప్రవేశపేట్టిన ఘనత కేసిఆర్‌ప్రభుత్వందేనన్నారు. రూ.5వేల కోట్లతో గొల్లకుర్మలకు మొదటి విడతలో గొర్రెలను పంపినీచేయడం జరిగిందన్నారు. రెండ విడత గొర్రెలను త్వరలో అందజేయడం జరుగుతుందన్నారు. చేనేల కార్మికులకు రూ. 1200 కోట్లతో బడ్జేట్‌ను కేటాయిస్తు ఆర్థికంగా ఆదుకునేందుకు చర్యలు చేపటడం జరుగుతుందన్నారు. తెలంగాణలో 54శాతం బీసీ జనభా ఉందన్నారు. బీసీ అభివృధ్ది లక్షంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. బీసీ విద్యార్థుల కోసం తెలంగాణప్రభుత్వం స్టడీ సర్కిల్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. టిఆర్‌ఎస్‌ప్రభుత్వం బీసీల ప్రభుత్వం దేనన్నారు. బీసీ విద్యార్థుల కోసం విదేశీ చదువుల కోసం ఖర్చును భరిస్తుందన్నారు. అంతకుముందు మండలంలోని తరోడ గ్రామంలో జెడ్పీటీసీ నివాసంలో జెడ్పీటీసీ లక్ష్మీనర్సాగౌడ్ మంత్రిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో మాజీ జెడ్పీచైర్మణ్ జుట్టు అశోక్, మాజీ ఎంపీపీ బాశెట్టి రాజన్న, మాజీ జెడ్పీటీసీ నారయణ్‌రెడ్డి, పెద్దరాజేశ్వర్, మొగులాజీ, రశీద్, రవీకిరణ్‌గౌడ్, టిఆర్‌ఎస్ కార్యకర్తలుపాల్గొన్నారు.

Comments

comments