బిల్ట్ పరిశ్రమ పునరుద్ధరణపై కెటిఆర్ సమీక్ష…

Ktr review on Ballarpur Industries Limited

హైదరాబాద్: పరిశ్రమల పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని ఐటి మంత్రి కెటిఆర్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మంగపేట మండలం కమలాపూర్‌లోని బల్లార్‌పూర్ ఇండస్ట్రీ లిమిటెడ్(బిల్ట్) పరిశ్రమ పునరుద్ధరణపై మంత్రులు కెటిఆర్, చందులాల్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి బిల్ట్ యాజమాన్యంతో పాటు పలువురు సంబంధిత అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. వారం రోజుల్లోగా పునరుద్ధరణ పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. కార్మికులను ఆదుకోవాలన్న లక్ష్యంతోనే యాజమాన్యం డిమాండ్లలను అంగీకరించామని చెప్పారు. భవిష్యత్‌లోనూ పరిశ్రమ యాజమాన్యానికి తగిన సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి కెటిఆర్ భరోసా ఇచ్చారు.

Comments

comments