బిడిఎస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

 Notification Release for BDS Seat Replacement

హైదరాబాద్: తెలంగాణలోని  ప్రైవేటు వైద్య కాలేజీల్లోని బిడిఎస్ కోర్సులో మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీకి కాళోజీనారయణ రావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నేడు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రైవేటు కాలేజీల్లోని బి,సి(ఎన్ఆర్ఐ) కేటగిరి సీట్లను ఈ మాప్ అప్ రౌండ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ నెల 10వ తేదీన ప్రొఫెసర్‌ జి.రాంరెడ్డి దూర విద్య కేంద్రం (పిజిఆర్ఆర్ సిడిఈ), ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్, హైదరాబాద్‌ లో కౌన్సెలింగ్‌ సెంటర్ ను ఏర్పాటు చేశారు.మరిన్ని వివరాల కొరకు www.knruhs.in వెబ్ సైట్ ను చూడవచ్చని యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఒక ప్రకటనలోతెలిపారు.

Comments

comments