బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు షూరు…

BJP's National Executive Meetings

న్యూఢిల్లీ: బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఆ పార్టీ ఛీఫ్ అమిత్‌షా కార్యవర్గ సమావేశాలను ప్రారంభించారు. బిజెపి పాలిత రాష్ర్టాల ముఖ్యమంత్రులు, అన్ని రాష్ర్టాల బిజెపి అధ్యక్షులు, బిజెపి అగ్రనేతలు, పలువురు కేంద్రమంత్రులు, ఎంపిలు సమావేశాలకు హాజరయ్యారు. లోక్‌సభ ఎన్నికలో విజయమే లక్ష్యంగా నాయకులకు అమిత్ షా, ప్రధాని మోడీ దిశానిర్దేశం చేయబోతున్నారు. అంతే కాకుండా త్వరలో ఎన్నికలు జరిగే 5 రాష్ర్టాల్లో విజయం సాధించడంపైనా భేటీలో చర్చలు జరిపారు. ఈ సమావేశాలకు తెలంగాణ రాష్ట్రం నుంచి లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి హాజరయ్యారు.