బిజెపి ఎంపి కారు ఢీకొని మహిళ మృతి!

అమరావతి: బిజెపి ఎంపి జివిఎల్ నరసింహారావు కారు ఢీకొట్టడంతో మహిళ మృతి చెందిన విషాద సంఘటన ఎపిలోని గుంటూరు జిల్లా కొలనుకొండ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలను వేగంగా వచ్చిన నరసింహారావు కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే గాయపడిన మహిళను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం […]

అమరావతి: బిజెపి ఎంపి జివిఎల్ నరసింహారావు కారు ఢీకొట్టడంతో మహిళ మృతి చెందిన విషాద సంఘటన ఎపిలోని గుంటూరు జిల్లా కొలనుకొండ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలను వేగంగా వచ్చిన నరసింహారావు కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే గాయపడిన మహిళను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఎంపి జివిఎల్ ఆ కారులోనే ఉన్నారని సమాచారం.

Comments

comments

Related Stories: