బిగ్ ‘సి’లో గెలాక్సీ నోట్ 9

Galaxy Note 9 release date

మార్కెట్లోకి విడుదల చేసిన సినీనటి పూజాహెగ్డే

మన తెలంగాణ/ హైదరాబాద్: మొబైళ్లను విక్రయించే సంస్థ బిగ్ ‘సి’ సామ్‌సంగ్ నుంచి సరికొత్త మోడల్ ‘గెలాక్సీ నోట్9’ను మార్కెట్లోకి విడుదల చేసింది. గురు వారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో బిగ్ సి వ్యవస్థాపకుడు, సిఎండి ఎం.బాలు చౌదరీ, సినీ నటి పూజా హెగ్డే, సామ్‌సంగ్ ప్రతినిధి అమిత్‌విగ్‌లు ఈ ఫోన్ ను లాంఛ్ చేశారు. బిగ్ సి ఎండి మాట్లాడుతూ, సామ్ సంగ్ అత్యంత శక్తివంతమైన మొబైల్ గెలాక్సీ నోట్9ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మార్కెట్లోకి విడుదల చేసిందని అన్నారు. ఈ మోడల్‌లో ఎస్ పెన్ ఫీచర్ ఉంది. అది రిమోట్ కంట్రోల్‌తో ఆపరేట్ చేస్తుంది. ఇంకా సెల్ఫీ లు, సరికొత్త ఫీచర్లు కెమెరా ‘డెక్స్’, హెచ్‌డి ఎంపి కూడా ఉన్నాయి. ఈ ఫోన్‌లో ఫీచర్లు.. 6.4 ఇంచ్ క్వాడ్ హెచ్‌డి ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే, 128/512 జిబి స్టోరేజ్, 512 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరే జ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 2960 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెస ర్, 6/8 జిబి ర్యామ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపి 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, డాల్బీ అట్మోస్, ఫింగర్‌ప్రింట్ సె న్సార్, బారో మీటర్, హార్ట్ రేట్ సెన్సార్, ఐరిస్ స్కానర్, ప్రెషర్ సెన్సార్,4జి వోల్ట్, ఎన్‌ఎఫ్‌సీ,ఫాస్ట్ చార్జింగ్, వైర్ లెస్ చార్జింగ్, 4000 ఎంఎహెచ్ బ్యాటరీ ఉన్నాయి.