బిఎస్‌ఎన్‌ఎల్ ‘రక్షాబంధన్’ ఆఫర్

BSNL Rakhi Recharge Gives Unlimited Voice Calls

న్యూఢిల్లీ: రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. రూ. 399తో ‘రాఖీ ఆఫర్’ను అందిస్తోంది. ఆఫర్ వ్యాలిడిటి 74 రోజులు. ఈ కాలపరిమితిలో అపరిమిత(అన్‌లిమిటెడ్) వాయిస్ కాల్స్, డేటా, అపరిమిత ఎస్‌ఎంఎస్‌ల ప్రయోజనాలు అందిస్తోంది. దీంతోపాటు అదనంగా పర్సనలైజ్డ్ రింగ్ బ్యాక్ టోన్(పిఆర్‌బిటి), అపరిమితంగా పాటలు మార్చుకునే వెసులుబాటు కూడా ఇస్తోంది. ఈ రాఖీ ఆఫర్ దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లకు వర్తిస్తుంది. బిఎస్‌ఎన్‌ఎల్ ఈ ఆఫర్ ప్యాక్ జియో, వొడాఫోన్, ఎయిర్‌టెల్‌కు గట్టి పోటీ ఇవ్వనుందని బిఎస్‌ఎన్‌ఎల్ భావిస్తోంది. ‘అన్నా చెల్లెళ్ల మధ్య ఉండే అపరిమిత ప్రేమ, ఆప్యాయతలకు ప్రతిరూపం రక్షాబంధన్ పండుగ. ఈ పండుగ సూర్తితోనే ‘రక్షాబంధన్ ఆఫర్’ తీసుకొచ్చాం’ అని బిఎస్‌ఎన్‌ఎల్ సిఎండి అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు.

Comments

comments