బిఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు తీపికబురు…

ముంబయి: త్వరలో జియో గిగాఫైబర్ రానున్న క్రమంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ తన బ్రాడ్‌బ్యాండ్ ఖాతాదారులకు శుభవార్త వినిపించింది. రూ.1045, రూ.1395, రూ.1895 ఇస్తున్నప్లాన్ లో డేటా లిమిట్స్‌ను పెంచి, తన కస్టమర్లు చేజారిపోకుండా ఉంటారని బిఎస్‌ఎన్‌ఎల్ భావిస్తోంది. రూ.1045 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లో ఇది వరకు కస్టమర్లకు 100 జిబి డేటాను ఇవ్వగా.. ఇకపై 150 జిబి డేటా ఇస్తోంది. దీంతో 30 ఎంబిపిఎస్ స్పీడ్‌తో నెట్‌ను ఆపరేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే రూ.1395 […]

ముంబయి: త్వరలో జియో గిగాఫైబర్ రానున్న క్రమంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ తన బ్రాడ్‌బ్యాండ్ ఖాతాదారులకు శుభవార్త వినిపించింది. రూ.1045, రూ.1395, రూ.1895 ఇస్తున్నప్లాన్ లో డేటా లిమిట్స్‌ను పెంచి, తన కస్టమర్లు చేజారిపోకుండా ఉంటారని బిఎస్‌ఎన్‌ఎల్ భావిస్తోంది. రూ.1045 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లో ఇది వరకు కస్టమర్లకు 100 జిబి డేటాను ఇవ్వగా.. ఇకపై 150 జిబి డేటా ఇస్తోంది. దీంతో 30 ఎంబిపిఎస్ స్పీడ్‌తో నెట్‌ను ఆపరేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే రూ.1395 ప్లాన్‌లో ఇప్పటి వరకు కస్టమర్లకు 150 జిబి డేటా లభించగా… ఇకపై 200 జిబి డేటా లభిస్తోంది. ఈ ప్లాన్‌లో 40 ఎంబిపిఎస్ నెట్ స్పీడ్ ఉంటుంది. అలాగే రూ.1895 ప్లాన్‌లో ఇప్పటి వరకు 200 జిబి వస్తుండగా… ఇకపై ఇందులో 250 జిబి డేటా లభిస్తోంది. ఈ ప్లాన్‌లో 50 ఎంబిపిఎస్ నెట్ స్పీడ్ వస్తుంది. బిఎస్ఎన్ఎల్ లోని అన్ని ప్లాన్లలోనూ డేటా లిమిట్ అయిపోగానే నెట్ స్పీడ్ 2 ఎంబిపిఎస్‌కు పడిపోతుందని సంస్థ వెల్లడించింది.

Related Stories: