బాహ్యగ్రహాల్లో నీటి ప్రపంచాలు

Water-found-in-Planets

ఇంతవరకు 4 వేల బాహ్యగ్రహాలు బయట పడ్డాయి. ఇవి రెండు మెయిన్ సైజు కేటగిరిలో ఉన్నాయి. వాటి చుట్టు కొలత భూమి కన్నా సరాసరి 1.5 లేదా 2.5 రెట్లు పెద్దదిగా ఉంది. ఇప్పుడు శాస్త్రవేత్తల బృందం వాటి అంతర్గత నిర్మాణ వ్యవస్థను పోలిన నమూనాను అభివృద్ధి చేసింది.కెప్లెర్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా బాహ్య గ్రహ సమాచారాన్ని నిపుణులు విశ్లేషించారు.గెయియా మిషన్ డేటాతో జోడించి ఆయా గ్రహాల బరువులో 50శాతం నీరు ఉంటుందని అంచనాగా వెల్లడించారు.

కొత్త అధ్యయనం ప్రకారం సౌరవ్యవస్థ బయట మూడు బాహ్యగహాల్లో ఒకటి భూమికన్నా పెద్దదిగా ఉన్న నీటి ప్రపంచంగా వెల్లడయింది. ఏ బాహ్యగ్రహమైనా భూమి కన్నా రెండు మూడు రెట్లు పెద్దదిగా ఉంటే జీవికి సంబంధించిన ప్రధాన మూలకం అక్కడ ఉండి ఉంటుందని భావిస్తున్నారు.బాహ్య గ్రహాలను కనుక్కునే కెప్లెర్ స్పేస్ టెలిస్కోప్, గెయియా మిషన్ మిషన్ బరువులో సగం నీరు అయి ఉండవచ్చని అది గడ్డ కట్టిన స్థితిలో కానీ ప్రవాహ స్థితిలో కానీ ఉండవచ్చని అంచనాగా చెబుతున్నారు. భూమితో పోల్చి చూస్తే భూమిపై నీరు భూ రాశిలో 0.02 శాతం ఉంటుంది.

ఈ పరిశోధనలో ప్రధాన పాత్ర వహించే డాక్టర్ లీజెంగ్ (హార్వర్డు యూనివర్శిటి) అనేక నీటి ప్రపంచాలు ఉండడం ఆశ్చర్యంలో కలిగిస్తోందని అన్నారు. ఇప్పటి వరకు 4 వేల బాహ్యగ్రహాలు వెల్లడయ్యాయి. అయితే ఇవి రెండు సైజు కేటగిరిల్లో ఉన్నాయి. కొన్ని 1.5 రెట్లు భూమికన్నా పెద్దదిగా వ్యాసం కలిగి ఉండగా మరి కొన్ని 2.5 రెట్లు పెద్దదిగా వ్యాసం కలిగి ఉన్నాయి. వ్యాసానికి రాశికి సంబంధాన్ని తాము పరిశీలిస్తున్నామని, దీన్ని ప్రకారం తయారు చేసిన నమూనా ఈ సంబంధాన్ని వివరిస్తుందని అన్నారు. ఈ నమూనా చిన్న పాటి గ్రహాలు రాళ్లతో కూడినవి అని, భూమిపై కన్నా అయిదు రెట్లు ఎక్కువగా రాళ్లు ఉంటాయని చెప్పారు.

పెద్ద గ్రహాలు పదిరెట్లు ఎక్కువ పరిమాణంలో ఉంటాయని, ఇవి బహుశా నీటి ప్రపంచాలని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ అధ్యయనాలను బోస్టన్‌లోని గోల్డ్ స్కిమిడిట్ సరస్సులో ప్రదర్శించారు. ఈ నీరు భూమిమీద సాధారణంగా కనిపించే నీరులా ఉండదన్నారు. ఈ గ్రహాల ఉపరితలం 200 నుంచి 500 డిగ్రీల ఉష్ణ్గోగ్రతలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. దిగువ భాగమంతా ద్రవ నీటితో ఆవిరితో కమ్ముకుని ఉంటుందని భావిస్తున్నారు. లోతుగా వెళ్తే రాతినేల తగిలే లోగా నీరు అధిక ఒత్తిడిగల మంచుగడ్డగా మారిపోతుందని అంటున్నారు. 1992లో ఇతర నక్షత్రాల కక్షలో ఉండే బాహ్య గ్రహాలపై జరిగిన పరిశోధన ఈ గ్రహాలను అధ్యయనం చేయడానికి ఆసక్తి కలిగించింది. అవి ప్రాణి మనుగడకు తగినవా కాదా అన్న దిశలో పరిశోధన సాగింది. సౌరవ్యవస్థలోని బుదుడు అంగారకుడు, శని, యురేనస్, నెప్టూన్ గ్రహాల్లో కూడా ఇదే విధంగా నీటి ప్రపంచాలు ఏర్పడి ఉండవచ్చని చెప్పారు.కొత్తగా ప్రారంభించిన టిఇఎస్‌ఎస్ మిషన్ ఇటువంటివి ఎన్నో కనుగొనగలుగుతుంది. తరువాతి తరం స్పేస్ టెలిస్కోప్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కొన్ని గ్రహాల వాతావరణ వ్యవస్థను విశ్లేషించగలుగుతుంది. ఈ మారుమూల ప్రపంచాల గురించి ఆసక్తి చూపించే వారికి ఇది మంచి ఉద్వేగ భరిత సమయం అని పరిశోధకులు పేర్కొన్నారు.

టెస్ (టిఇఎస్‌ఎస్ – ట్రాన్సిటింగ్ ఎక్సో ప్లానెట్ సర్వే శాటిలైట్ ) బాహ్య గ్రహాల కోసం పరిశోధిస్తోంది.
– మన తెలంగాణ / సైన్స్ విభాగం

Comments

comments