బావిలో పడ్డ బైక్.. ఒకరి మృతి

రాజన్నసిరిసిల్ల: బైక్ అదుపు తప్పి బావిలో పడటంతో యువకుడు మృతిచెందిన విషాద సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లాలోని కోనారావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని చికిత్స కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు […]

రాజన్నసిరిసిల్ల: బైక్ అదుపు తప్పి బావిలో పడటంతో యువకుడు మృతిచెందిన విషాద సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లాలోని కోనారావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని చికిత్స కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments