బావిలో దూకి వ్యక్తి ఆత్మహత్య

One's suicide by jumping into the well
గాంధారి: మండల పరిధిలో మద్యానికి బానిసై ఒకరు తన జీవితాన్నే తనువు చాలించుకున్న సంఘటన గురువారం చోటుచేసుకుంది. గాంధారి ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం… గాంధారి మండలం, చద్మల్ తాండాకు చెందిన సుభాష్ మద్యానికి బానిసై తరుచు భార్యతో గొడవపడేవాడని, ఈ నేపథ్యంలో భార్యాపిల్లల పోషణ భారం బాగా పెరగడంతో ఆయన జీవితం పై విరక్తి చెంది తాండా సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సత్యనారాయణ తెలియజేశారు.

Comments

comments