బాల కార్మికులకు బంగారు భవిష్యత్తు కల్పిదాం

Let's prepare the golden future for child laborers
కొత్తగూడెం: జిల్లాలోని బాల కార్మికులను బడిలో చేర్పించి వారికి బంగారు భవిష్యత్ కల్పిద్దామని చైల్డ్ లైన్ ప్రాజెక్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లe కె. సంతోషరూప అన్నారు. చల్డ్ లైన్ టోల్ ఫ్రీ 1098 చెన్నైకి అందిన ఫిర్యాదులోని అడ్రస్సు కోసం ఆమే రామవరంలోని వేణుగోపాల్ స్వామి టెంపుల్ ఏరియాకు వచ్చారు. మహబూబ్‌పాషాను వారు తల్లిదండ్రులు బడి మానిపించి పనులకు పంపిస్తున్నారని, దీంతో చెడు అలవాట్లకు బానిస అవుతున్నాడని పరిసర ప్రాంత ప్రజలను విచారించి నిర్ధారించుకున్న అనంతరం పాషా తల్లిదండ్రులకు ఆమే కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం రామవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేర్పించేందుకు ఒప్పించారు. పాషాకు చదవుకోవడం వలన కలిగే లాభాల గురించి, చదువు యొక్క విలువల గురించి తెలిపారు. బాగా చదవడం వలన ఉన్నత స్థానాలకు ఎదగవచ్చాన్ని. ఈ సందర్భంగా మట్లాడుతూ.. డ్రాప్ అవుట్స్, బాల కార్మికులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారికి 18 ఏళ్లు వచ్చే వరకు ప్రభుత్వం ఉచింతంగా చదవు నేర్పిస్తుందన్నారు. ప్రజా సంఘాలు కూడా బాల కార్మికులపై దృష్టి సారించాలన్ని. పాషాను బడిలో చేర్పించేందుకు సహరించిన రామవరం పరిరక్షణ కమిటి అధ్యక్షుడు ఎం.డి. ముస్తఫా, మజీద్ కమిటి సభ్యుడు జకీర్‌లను అభినందించారు. పాషాపై చదవులో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రధోపాధ్యాయులు రామారావుకు సూచించారు.

Comments

comments