బాలీవుడ్ బడా హీరో ప్రేమలో కైరా?

ముంబయి: ‘ధోనీ’ మూవీతో బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కైరా అద్వానీ టాలీవుడ్ లో కూడా ఘన విజయం సాధించిన ‘భరత్ అనే నేను’ మూవీతోనే తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. భరత్ లో తనదైన నటన, అందంతో కైరా తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. దీంతో బోయపాటి దర్శకత్వం వహిస్తున్న మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. బాలీవుడ్ లోనూ పలు చిత్రాల్లో నటిస్తోంది కైరా. అయితే, తాజాగా కైరా గురించి […]

ముంబయి: ‘ధోనీ’ మూవీతో బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కైరా అద్వానీ టాలీవుడ్ లో కూడా ఘన విజయం సాధించిన ‘భరత్ అనే నేను’ మూవీతోనే తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. భరత్ లో తనదైన నటన, అందంతో కైరా తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. దీంతో బోయపాటి దర్శకత్వం వహిస్తున్న మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. బాలీవుడ్ లోనూ పలు చిత్రాల్లో నటిస్తోంది కైరా. అయితే, తాజాగా కైరా గురించి ఓ వార్త బీ-టౌన్ తెగ హల్ చల్ చేస్తోంది. బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఆమె ప్రేమలో ఉందనేది ఈ వార్త సారాంశం. ఇక ఇంతకుముందు పలువురు బాలీవుడ్ భామలతో సిద్ధార్థ్ ప్రేమాయణం నెరిపిన సంగతి తెలిసిందే. తనతో తొలి చిత్రం ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’లో నటించిన ఆలియా భట్ తో సిద్ధార్థ్ ప్రేమాయణం నడిపాడు. ఆ తరువాత కొంత కాలం తర్వాత వీరిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం అలియా రణబీర్ కపూర్ తో ప్రేమలో ఉన్న సంగతి. ఇక అనంతరం మరో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తో సిద్ధార్థ్ లవ్ లో పడ్డాడు. అయితే, ఆమెతో కూడా దూరమయ్యాడు సిద్ధార్థ్. ఇప్పుడు కైరాతో ప్రేమాయణం నడుపుతున్నాడనేది బాలీవుడ్ జనాల టాక్. దీనికి ఊతమిస్తూ వీరిద్దరూ తరచూ మీడియా కంటికి చిక్కుతున్నారు. ఇటీవల కైరా బర్త్ డే పార్టీకి కూడా సిద్ధార్థ్ హాజరయ్యాడట. దీంతో కైరా, సిద్ధార్థ్ పీకలోతు ప్రేమలో మునిగి తెలుతున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Comments

comments

Related Stories: