బాలిక గొంతులో తొమ్మిది సూదులను గుర్తించిన వైద్యులు

కోల్ కతా: గొంతు నొప్పితో బాధపడ్డాతు ఆస్పత్రికి వేళ్లిన బాలిక గొంతులో తొమ్మిది సూదులను గుర్తించిన వైద్యులు ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ లోని నాదియా జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. నాదియా జిల్లాలోని కృష్ణాగర్ ప్రాంతానికి చెందిన బాలిక గొంతు నొప్పితో జూలై 29న కోల్ కతాలోని ప్రభుత్వ దవాఖానలో చేరింది. ఆమెకు ఎక్స్ రే తీసిన వైద్యులు గొంతు భాగంలో తొమ్మిది సూదులను వైద్యులు బాలికకు శస్త్రచికిత్స చేసి వాటిని తొలగించారు. వాటిలో ఒకటి గొంతు […]

కోల్ కతా: గొంతు నొప్పితో బాధపడ్డాతు ఆస్పత్రికి వేళ్లిన బాలిక గొంతులో తొమ్మిది సూదులను గుర్తించిన వైద్యులు ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ లోని నాదియా జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. నాదియా జిల్లాలోని కృష్ణాగర్ ప్రాంతానికి చెందిన బాలిక గొంతు నొప్పితో జూలై 29న కోల్ కతాలోని ప్రభుత్వ దవాఖానలో చేరింది. ఆమెకు ఎక్స్ రే తీసిన వైద్యులు గొంతు భాగంలో తొమ్మిది సూదులను వైద్యులు బాలికకు శస్త్రచికిత్స చేసి వాటిని తొలగించారు. వాటిలో ఒకటి గొంతు వెనక భాగంలో, ఎనిమిది సూదులు ఆహార వాహిక దగ్గర్లో ఉన్నాయి. అసలు ఆమె గొంతులోకి ఆ సూదులు ఎలా వెళ్లాయే వైద్యులు చెప్పలేకపోయారు. నాలుగు గంటల పాటు శస్త్రచికిత్స చేసిన వాటిని తొలగించారు. ప్రస్తుతం ఆ బాలిక మాట్లాడే స్థితిలో లేదు. కాని ఈ ఘటనకు సంబంధించిన కారణాలేంటనేది వైద్యులు వెల్లడించలేక పోతున్నారు. అయితే ఈ ఘటనపై ఆమె తల్లిదండ్రులు మాత్రం మాట్లాడడానికి ఇష్టపడడంలేదు. బాలిక వాటిని మింగలేదని, ఎవరో బయట నుంచి వాటిని గొంతులోకి దూర్చారని వైద్యులు భావిస్తున్నారు. అవి గొంతు కండరాల్లో చిక్కుకుపోయాయని, అయితే, ఆహార వాహికకు ఎలాంటి ఇబ్బందీ లేదని తెలిపారు. ఈ ఘటన వెనక ఓ జ్యోతిష్యుడి ప్రమేయం ఉందని ఆ బాలిక పొరుగువారు భావిస్తున్నారు. ‘ఆ బాలిక సోదరుడు మూడు సంవత్సరాల క్రితం మరణించాడు. అప్పుడే ఆమె తల్లిదండ్రులు ఓ బాలికను దత్తత తీసుకున్నారు. కానీ ఆమె కూడా మరణించింది. ఈ ఘటనలతో బాధితురాలు కుంగుబాటుకు గురైంది. ఆమెను మామూలు మనిషిని చేయడం కోసం కుటుంబ సభ్యులు ఓ జ్యోతిష్యుడిని సంప్రదించారు’ అని ఆ కుటుంబం పొరుగున నివసించే వ్యక్తి ఒకరు వెల్లడించారు. అతడే ఈవిధంగా చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు.

 

Comments

comments

Related Stories: