బాలల హక్కులను పరిరక్షించాలి

Protection of child rights

ఉమ్మడి నల్లగొండ అదనపు జిల్లా న్యాయమూర్తి సి.వి. విఘ్నేశ్వరి , కలెక్టర్ సురేంద్రమోహన్

జిల్లా అధికారుల పనితీరుపై సంతృప్తి : ఉమ్మడి నల్లగొండ అదనపు జిల్లా న్యాయమూర్తి సివి విఘ్నేశ్వరి
జిల్లాలో మహిళా సాధికారత, బాలల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చట్టాలు : కలెక్టర్ సురేంద్రమోహన్ 

మనతెలంగాణ/సూర్యాపేట: భారత రాజ్యాంగంలో కల్పించిన బా లల హక్కులు, చట్టాలపై ప్రతి ఒక్కరు పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా అదనపు ప్రథమశ్రేణి న్యాయమూర్తి సివి విఘ్నేశ్వరి అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నల్లా ఆధ్వర్యంలో జాతీయ న్యాయసేవ అధికార సంస్థ రూ పొందించిన జా తీ య బాలల హక్కులు, చట్టాలు, చైతన్య సదస్సు కార్యక్రమంలో జి ల్లా కలెక్టర్ కె.సురేంద్రమోహన్, సెక్రటరీ, సీనియర్ సివిల్ న్యాయమూర్తి కె.ప్రభాకర్‌రావు, జిల్లా ఎస్పీ ప్రకాశ్‌జాదవ్‌తో కలిసి ఆమె పా ల్గొన్నారు. జాతీయ న్యాయసేన అధికారిక సంస్థ రూ పొ ందించిన బా ల ల హక్కులు, సంరక్షణ, న్యాయసేవలపై ఆమె వివరించారు. గ్రా మీణ ప్రాంతాలలో అవగాహన లోపం వలన బాల్య వివాహాలు అధికంగా నిర్వహిస్తున్నారని, ఉమ్మడి జిల్లాలో న్యాయ, రెవిన్యూ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో మహిళలకు న్యాయచైతన్య సదస్సులు ఏర్పాటు చేసి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. యువత చెడు మార్గంలో వెళ్లకుండా తల్లిదండ్రులు చూపే అన్ని రకాల అంశాలు, ప్రక్రియలు వాటి కి సంబంధించిన అన్ని నిర్ణయాలను బాలల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అనేక అత్యుత్తమ ప్రయోజనాలకు భంగం కలుగుతుందని హెచ్చరించారు. అదే విధంగా 18 సంవత్సరాల లోపు పిల్లలో ఎవరికైనా ఉద్దేశపూరిత నేరం చేయలేదని, నేరం చేసిన సందర్భంలో స్పెషల్ జువైనల్ పోలీస్ యూనిట్ నందు బా లలను చేర్పించడం జరుగుతుందని అన్నారు. జిల్లా అధికారుల పనితీరును ఆమె ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ సివిల్ న్యాయమూర్తి కె.ప్రభాకర్‌రావు మాట్లాడుతూ బాలల న్యాయ సంరక్షణ చట్టం 2016 జనవరికి న అమలులోకి వచ్చిందని, ఆదరణ, సంరక్షణ అవసరమైన బాలలకు సంబంధించి పాత చట్టాన్ని సవరిస్తూ ఈ చట్టం రూపొందించడం జరిగిందని వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ అనేక సం క్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. ప్రభు త్వం కార్పొరేట్ స్థాయిలో పాఠశా లలు, వసతి గృహాలను నిర్మించి వి ద్యతో పాటు పౌష్టికాహారం అంది స్తున్నట్లు తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణకు ప్రత్యేకచర్యలు చేపట్టినట్లు,2019 జనవరి 1న నాటికి బాల కార్మికులు లేని జిల్లాగా తీర్చిదిద్దాలని అన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ ప్రకాశ్‌జాదవ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో బాలల హక్కుల పరిరక్షణ కొరకు ప్రత్యేక అవగాహన సదస్సులు ప్రతి నెలలో ఒక రోజున ఏర్పాటు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. నేటికి కొన్ని గ్రామాలలో మహిళల లింగవివక్ష చూపించడం విచారకరమని అన్నారు. అనంతరం కేంద్ర మంత్రిత్వ శాఖ వారిచే రూపొందించిన స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2018 గోడ పత్రికను అధికారుల సమక్షంలో ఆవిష్కరించారు.ఈ సదస్సులో ఉమ్మడి నల్లగొండ న్యాయమూర్తులు శారదాదేవి, గౌతమి, డిఆర్‌ఓ యాదిరెడ్డి, కిరణ్‌కుమార్, జిల్లా వైద్యశాఖ అధికారిణి కళావతిభాయి, జిల్లా విద్యాశాఖాధికారి చైతన్యజైనీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Comments

comments