బాబాయ్ కోసం సాహసం

Ram Charan To Surprise Pawan Kalyan on His Birthday

బాబాయ్ పవన్ బర్త్‌డేకు సర్‌ప్రైజ్ ఇస్తానని రామ్‌చరణ్ అనగానే అదేంటని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశా రు. ఆ సర్‌ప్రైజ్ గురించి పరిపరివిధాలుగా అభిమానుల ఆలోచనలు సాగాయి. అయితే బాబాయ్ కోసం  రామ్‌చరణ్  చాలా పెద్ద సాహసమే చేశాడు. తనకు బర్త్‌డే విషెస్ మామూలుగా చెబితే కిక్కేం ఉంటుందని భావించి ఏకంగా పారా గ్లైడింగ్ చేసి పవన్‌కు శుభాకాంక్షలు తెలియజేశాడు. దీనికి పవన్  స్ఫూర్తి అని తన ప్రేమను చాటుకున్నాడు. ఇలాంటి డేరింగ్ ఫీట్స్ చేయాలంటే బాబాయే  ప్రేరణ అని తెలిపాడు. ఈ మేరకు ఓ వీడియోను ఫేస్‌బుక్‌లో చెర్రీ పోస్ట్ చేశాడు. ప్రస్తు తం ఈ వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. పారా గ్లైడింగ్ సమయంలో చరణ్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇంతకీ ఈ సాహసకృత్యం ఎక్కడ చేశాడో తెలియలేదు. ఇకపోతే చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న మూవీ కోసం ఓ అరుదైన లొకేషన్‌కు వెళ్తున్నాడు. అదే యూరప్‌లోని అజెర్‌బైజాన్ ప్రాంతం. అక్కడి అరుదైన లొకేషన్లలో షూటింగ్ చేస్తారట. అక్కడికి వెళ్లే ముందు ఇలా అడ్వెంచర్ స్పోర్ట్‌తో చరణ్ అభిమానులను ఆకట్టుకున్నాడు.