బాధిత కుటుంబాలకు..సిఎం సహాయనిధి గొప్పవరం

Chief Minister of the affected families is a great gift

మన తెలంగాణ/వనపర్తి: బాధిత కుటుంబాలకు సిఎం సహాయనిధి ఒక గొప్ప వరమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తి పట్టణ కేంద్రంలోని నిరంజన్ రెడ్డి నివాసంలో గురువారం  ఏర్పాటు చేసిన సమావేశంలో బాధిత కుటుంబ సభ్యులకు సిఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. వనపర్తి మండల పరిధిలోని చందాపూర్ గ్రామానికి చెందిన  రాములుగౌడ్‌కు   రూ. 12,500  సిఎం సహాయనిధి చెక్కును నిరంజన్‌రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అంద జే శారు. ఈసందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ఆపదలోని కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు సిఎం సహాయనిధి ఆర్థిక సహాయం ఆదుకుంటుందని కుటుంబంలోని ఆర్థిక బాధలు తీరుతాయని ఆయన అన్నా రు. బాధిత కుటుంబ సభ్యులకు నిరంజన్‌రెడ్డి అందజేశారు. మీడియా సెల్ కన్వీనర్ శ్యాం, టిఆర్‌ఎస్ నాయకులు కురుమూర్తి, చిట్యాల రాము, సుదర్శన్‌రెడ్డిలు పాల్గొన్నారు.

Comments

comments