బస్సుపై ఏనుగు ఎలా దాడి చేస్తుందో చూడండి (వీడియో)

Elephant-Attack-on-Bus

తిరువనంతపురం: కర్నాటకలోని బందీపూర్ అటవీ ప్రాంతంలో ఓ బస్సును ఏనుగు వెంటాడింది. ఓ ప్రైవేటు బస్సు 40 మంది పర్యాటకులతో కర్నాటకలోని చామరాజ్ నగర్ నుంచి కేరళలోని కాలికట్ వెళ్తుంది. బస్సు వెళ్తుండగా ఓ ఏనుగుల మంద  రోడ్డుపైకి వచ్చింది. ఏనుగుల గుంపు వెళ్లిపోయిన తరువాత బస్సు ముందుకు కదులుతుండగా మరో ఏనుగు రోడ్డుపైకి వచ్చింది. రోడ్డుపైకి వచ్చిన ఏనుగు బస్సు వైపుకు కదిలింది. దీంతో బస్సు డ్రైవర్ అప్రమత్తమై 500 మీటర్లు వెనక్కి బస్సును తీసుకెళ్లాడు. అయినా కూడా ఏనుగు బస్సును వెంబడించి తన తొండంతో డ్రైవర్ ముందుభాగంలో అందంను ధ్వంసం చేసింది. తరువాత ఏనుగు నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనను ఓ పర్యాటకుడు తన పోన్ లో వీడియో తీశాడు.  సోషల్ మీడియాలో ఈ వీడియో హల్ చల్ చేస్తోంది.

Comments

comments