బలమైన కవితాప్రక్రియ ‘నానీలు’

పూర్వ సాహిత్యం పద్యంలో రాజ్యమేలితే ఆధునిక సాహిత్యం వచన కవిత్వంలో రాజ్యమేలింది. ఈ వచన కవి త్వం కూడా అనేక రూపాల్లో విస్తరించి తన అస్తిత్వాన్ని నిలుపుకుంది. కాలానుగుణంగా మా ర్పులు వచ్చినట్లే సాహిత్యంలో నూ అనేక విప్లవాత్మక మార్పు లు చోటుచేసుకున్నాయి. ఆధునిక కవిత్వంలో వచన కవిత్వం, మినీ కవిత్వం, దీర్ఘ కవిత్వంలతో పాటు హైకూలు, రెక్కలు, నానీలు, నానోలు, ముక్తకాలు, టుమ్రీలు, చుక్కలు, వ్యంజకాలు, ముత్యాల సరాలు, మొగ్గలు వంటి నూతన కవితా ‘రూప […] The post బలమైన కవితాప్రక్రియ ‘నానీలు’ appeared first on .

పూర్వ సాహిత్యం పద్యంలో రాజ్యమేలితే ఆధునిక సాహిత్యం వచన కవిత్వంలో రాజ్యమేలింది. ఈ వచన కవి త్వం కూడా అనేక రూపాల్లో విస్తరించి తన అస్తిత్వాన్ని నిలుపుకుంది. కాలానుగుణంగా మా ర్పులు వచ్చినట్లే సాహిత్యంలో నూ అనేక విప్లవాత్మక మార్పు లు చోటుచేసుకున్నాయి. ఆధునిక కవిత్వంలో వచన కవిత్వం, మినీ కవిత్వం, దీర్ఘ కవిత్వంలతో పాటు హైకూలు, రెక్కలు, నానీలు, నానోలు, ముక్తకాలు, టుమ్రీలు, చుక్కలు, వ్యంజకాలు, ముత్యాల సరాలు, మొగ్గలు వంటి నూతన కవితా ‘రూప ప్రక్రియ లు’ తెలుగులో వచ్చాయి.ఇందులో హైకూలు ఒక్కటే విదే శీ కవితా ప్రక్రియ కాగా, మిగతావి తెలుగు సాహిత్యంలోనే పురుడుపోసుకోవడం విశేషం.
తెలుగు సాహిత్యంలో వచన కవిత్వం, మినీ కవిత్వం బాటలో ‘నానీలు’ కవితారూప ప్రక్రియ ఒక సంచలనాన్నే సృష్టించింది. దీని సృష్టికర్త డా.ఎన్.గోపి. దీనిని ఆయన 1997లో ప్రారంభించాడు. ఈ ‘నానీలు’ ప్రారంభించిన అనతికాలంలోనే అనేకమంది కవులు అక్కున చేర్చుకున్నా రు. వర్ధమాన కవుల నుంచి ప్రముఖ కవుల దాకా ‘నానీలు’ను సృష్టించినవారే ఇప్పటికీ ఈ కవితా ప్రక్రియలను రచిస్తున్నారంటే దీని ప్రాసంగికతను అర్థం చేసుకోవచ్చు. ఇరవై ఏళ్ళుగా అప్రతిహతంగా కొనసాగుతున్న ప్రక్రియగా నానీలను చెప్పుకోవచ్చు.
నానీలు మొట్టమొదటిసారిగా ‘వార్త’ దినపత్రికలో 20 వారాలపాటు సంపాదకీయ పేజీలో ధారావాహికంగా ప్రచురించబడి తెలుగు సాహిత్యలోకానికి కొత్త చూపును ప్రసరించింది. అనంతరం 1998లో ‘నానీలు’ తొలిసారిగా పుస్తకరూపంలో వెలువడింది. 1997లో తెలుగు సాహిత్యంలో ఒక వినూత్న ప్రక్రియగా ఆవిర్భవించిన ‘నానీలు’ నేడు ఎందరో కవులు నిత్యం రాస్తూ ‘నానీలు’ ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కారణం నాలుగే పాదాలలో నానీలను ఆవిష్కరించడం. ఈ నాలుగు పాదాల్లో కూడా 20 నుంచి 25 అక్షరాలు మాత్రమే ఉండాలనే నిబంధన ఉంది. 20కి తగ్గకుండా, 25కు మించకుండా నానీలను రాయగలగాలి. అయితే మొత్తం నాలుగు పాదాల్లోని మొదటి రెండు పాదాలు ఒక అంశాన్ని చెబితే, చివరి రెండు పాదాలు మరో అంశాన్ని చెబుతూ సమర్థించేదిగా ఉంటుంది. మొదటి రెండు పాదాలకు చివరి రెండు పాదాలు సమర్థింపు అన్నమాట.
‘నానీలు’ అంటే ‘నావీ నీవీ వెరసి మనవి’ అని అర్థం. అంటే నానీలు మనవేనని అర్థం చేసుకోవాలి. మన ఇళ్ళ ల్లో చిన్న పిల్లవాడిని ‘నానీ’ అని పిలుస్తుంటాం. అలా తెలుగు కవిత్వంలో ‘నానీలు’ చిన్నవి. చిన్న చిన్న పదాలతోనే పెద్ద పెద్ద భావాలను ఆవిష్కరించే ప్రయత్నమే ‘నానీలు’ యొక్క కవితాగుణం. దీనికి అక్షర నియమం తప్పి తే ఛందో నియమం లేదు. నాలుగు పాదాల పద్యాన్ని ఛం దస్సులో ఆవిష్కరిస్తే, అవే నాలుగు పాదాల నానీలను ఛందస్సు లేకుండా ఆవిష్కరించడం.
డా.ఎన్.గోపి ‘నానీలు’ను ఒక ప్రతిభావంతమైన వచన మినీ కవితాప్రక్రియగా సృష్టించాడు. అల్పాక్షరాలలో అనంతమైన భావాలను, ఆవిష్కరించే ప్రయత్నం ఈ ‘నానీలు’లో కనబడుతుంది. సంక్షిప్తత, సరళత, సూక్ష్మత, గాఢత, సాంద్రత ‘నానీలు’కు పట్టుగొమ్మలు. ఈ కొమ్మలుంటేనే నానీల చెట్టూ ఎదుగుతుంది. నేల సారవంతంగా ఉంటేనే వృక్షాలు సమున్నతంగా ఎదుగుతాయి. నానీలు కూడా అంతే. నానీల్లో ముఖ్యంగా భావ సాంద్రత ఉంటేనే అవి నిలుస్తాయి. కవిత్వపాలు ఉంటేనే మనుగడ సాగిస్తాయి. నానీలు రాస్తున్న కవులంతా దీనిని దృష్టిలో ఉంచుకొనే రాస్తున్నారు. ఇదొక విలక్షణత కల్గిన ఆధునిక నూతన ప్రక్రియ. ఇప్పటికీ వందల సంఖ్యలో ‘నానీలు’ను కవులు రాస్తున్నారు. వస్తు వైవిధ్యంతో నేటికీ నానీలు వివిధ పత్రికల్లో వెలుడుతూనే ఉన్నాయి. వందల సంఖ్య లో కవితా సంపుటాలు వెలువడ్డాయి.
గోపి రాసిన ఈ నానీ చూడండి
‘కుండ ముక్కలైందా/కుమిలిపోకు/మట్టి మరోరూపం కోసం/ సిద్ధమౌతుంది’ ఇందులోని రెండు పాదాలు ఒక భావాంశాన్ని చెబితే, మిగతా రెండు పాదాలు సమర్థించేవిగా చెప్పబడింది. చిన్నపాదాలలోనే అనంతమైన భావా న్ని ఈ నానీలో ఆవిష్కరించబడింది. అనేక విభిన్న వస్తువుల సమాహార రూపం ‘నానీలు’. సమాజంలోని భిన్న ప్రవృత్తులను ఆవిష్కరించే ప్రయత్నమే ‘నానీలు’ ఆవిష్కరించిడానికి కారణం. జీవితాన్ని రాపిడిపడితేనే అనుభవాలు అక్షరాలుగా మారి నానీలుగా రూపాంతరం చెందుతాయి. ఒక్కో అనుభవం మానవసంవేదనల ప్రతిరూపం. అనుభూతుల్లో తడిసిన ప్రతి అక్షరసుమాలను ‘నానీ’ కవితామాలగా ధరిస్తే అది తెలుగు సాహిత్యంలో పరిమళభరితమవుతుంది. సాహితీలోకానికి సుగంధాలను వెదజల్లుతుంది. ఇంతవరకు వెలువడిన నానీల్లో సామాజికాంశాలతో పాటు ప్రాకృతికత, తాత్వికతలే కాక అమ్మ, నాన్న, గురువు, భక్తి, రైతు, పల్లె, ప్రేమ, దేశభక్తి, చేనేత, కుటుం బం, తెలంగాణ, నగరం, వృత్తులు, జాతిరత్నాలు మొదలైన అంశాలను నానీల్లో బలంగా కవులు చాటారు. ఇంకా విభిన్నమైన వస్తువులతో నానీలను ఆవిష్కరిస్తున్నారు. రాయడానికి సులువైన కవితా ప్రక్రియలో నానీ ప్రక్రియ ఒకటి.ఇదొక దేశీయ కవితాప్రక్రియగా తెలుగు సాహిత్యం లో నిలిచిపోయింది. ఎంతోమంది ప్రసిద్ధ కవులునానీలను తమ గుండెలకు హత్తుకుని నానీ దీపాలను వెలిగించారు.
తెలుగు సాహిత్య లోకంలో నానీ ప్రక్రియకు ఊహించలేనంత ప్రాచుర్యం లభించడం నిజంగా నానీ ఒక కవితా ప్రక్రియగా విజయవంతంగా రావడానికి కారణమైంది. ఎన్.గోపి అనంతరం నానీలను సుప్రసిద్ధ కవులు రాయడం విశేషం. డా.ఎస్.రఘు, కోట్ల వేంకటేశ్వరరెడ్డి, ఎస్.ఆర్.భల్లం, సోమేపల్లి వెంకటసుబ్బయ్య, ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, అంబల్ల జనార్ధన్, డా॥ ద్వానాశాస్త్రి, రసరాజు, డా॥ సి.భవానీదేవి, డా॥ నలిమెల భాస్కర్, నాంపల్లి సుజాత, అన్నవరం దేవేందర్, ఆచార్య మసన చెన్నప్ప, ఆచార్య సూర్య ధనుంజయ, నేతల ప్రతా ప్ కుమార్, వల్లభాపురం జనార్ధన, డా.భీంపల్లి శ్రీకాంత్ తదితరులు నానీలను బలంగా రాశారు. ఇంకా రాస్తూనే ఉన్నారు. నానీలను ఎంతరాసినా అది తరగని గని. విభి న్న అంశాలను వైవిధ్యమైనరీతిలో కవిత్వంగా చెప్పడం నానీల్లోనే సాధ్యమవుతుంది. తెలుగులో ఎన్ని మినీకవితా రూప ప్రక్రియలు వచ్చినప్పటికీ ఒక బలమైన రూపప్రక్రియలుగా ‘నానీలు’తెలుగు సాహిత్యంలో నిలిచిపోయింది.
నానీ వ్యష్టిగా ప్రారంభమై సమిష్టిగా ఎదిగింది. ఒక సాహితీ శక్తిగా రూపాంతరం చెందింది.ఒక సాహిత్య ప్రక్రియగా అవతరించి వచన కవితా సరసన నిలబడింది. ప్రక్రియ సులువుగా ఉండడంతో తెలుగు కవులంతా దీనివైపు దృష్టి సారించారు.నానీలను బలంగా ఆవిష్కరించా రు. దీంతో నానీల విజయయాత్ర తెలుగు సాహిత్యంలో కొనసాగింది. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.రెండు దశాబ్దాలకు పైగా ఒక కవితా ప్రక్రియ ఇంకా సజీవంగా కొనసాగుతున్నదంటే నానీ రూపం అందరికీ నచ్చడమే. రూ పంలో చిన్నవిగా,భావంలో పెద్దవిగా ఉండడంనానీల విశే ష లక్షణం.ఆ రూపశిల్పి గోపి మీద ఉన్న అభిమానమే.
డా॥ ఎన్. గోపి నానీలు రాసిన తరువాత మొదటి సారిగా ఆ ప్రక్రియను అందుకుని ప్రముఖ కవి డా॥ ఎస్. రఘు అనేక నానీలను రచించాడు. అన్నీ బలమైన నానీలనే రచించడం విశేషం
‘వంతెన పునాదులు/నీళ్లల్లో /జీవితం పునాదులు/ కన్నీళ్లలో’ ఇలాంటి నానీలు డా॥ ఎస్. రఘు కలం నుంచి పుంఖానుపుంఖాలుగా వెలువడ్డాయి. జీవితాన్ని వడబోసిన నానీ ఇది. ప్రముఖ కవి కోట్ల వేంకటేశ్వరరెడ్డి ‘నగరం’ గురించి అద్భుతమైన నానీ రచించాడు. తెలంగాణ ఉద్యమకాలంలో ఆంధ్రవలసవాదులు నగరానికి వచ్చి, నగరాన్ని ఎట్లా విచ్చలవిడితనానికి గురి చూసిందో చక్కగా నానీలో ఆవిష్కరించారు.
‘నగరాన్ని చూస్తే/ అమ్మక్కను చూసినట్లుండేవి/ వాడొచ్చిండు/ వరస మారింది’ ఒకప్పుడు నగరం అందరినీ ఆలింగనం చేసుకునే ఆత్మీయనేస్తం. వలసవాదులు అడు గు పెట్టారో లేదో వరసలు మారిపోయి నగరం విచ్చలవిడితనానికి అలవాటుపడిందని చెబుతాడు.
పదాలు మామూలువే అయిన ఆవిష్కరించడతోనే దాని విశిష్టత తెలుస్తుంది.భావవ్యక్తీకరణకు నానీలు ఆలంబన కావడంతో ప్రత్యామ్నాయ కవితా ప్రక్రియగా తెలుగు సాహిత్యంలో నిలదొక్కుకుంది. ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి లాంటి వారు కూడా నానీలను గుండెలకు హత్తుకోవడం విశేషం. గ్రామీణ జీవన పరిస్థితులను వర్ణి స్తూ సీమ నానీలును రాచపాళెం ఆవిష్కరించాడు.
‘వలస తలుపులకు/బ్యాంకు నోటీసా/ఏ దరికి చేరునో/ రెండో మరణశాసనం’వలసనుమొదటి మరణంగా భావిం చి, బ్యాంకు నోటీసును రెండో మరణశాసనంగా వర్ణించిన తీరు పల్లె జీవన చిత్రాన్ని కళ్ళకుకడుతుంది. పల్లె ఏ కాలమైనా వలసలకు కేంద్రమై విలసిల్లుతూనే ఉంటుంది.
ప్రముఖ రచయిత్రి డా.సిభవానిదేవి వివాహాన్ని గురించి చెప్పిన నానీ అందరినీ ఆలోచింపజేస్తుంది.
‘వివాహమా/ఎంతపని చేశావ్ ?/పుట్టింటికే/నన్ను అతిథి ని చేసేశావ్’ ఇది మహిళలందరికీ వర్తించే సజీవమైన నా ని ఆలోచింపజేసే నాని.ఇది నానీలలో బాగా పేలిన నాని.
మహిళలకు పుట్టిల్లు, మెట్టిళ్ళు రెండు ఉంటాయి. వా రికి రెండూ సమానమే. అయినా మెట్టింటి కడప తొక్కినం క పుట్టినిళ్ళు అతిథి ఇల్లుగా కన్పిస్తుంది. ఇదే భావనపై నానీలో ధ్వనించింది. ఒక వ్యంగ్యంగా, సూటిగా,ప్రశ్న గా చెప్పిన నాని ఇది. అనాదిగా రైతుది జీవన్మరణ సమ స్యే. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మారనిది రైతు బతుకు ఒక్కటే. అలాంటి రైతు గురించి నానీలు కూడా చాలావ చ్చాయి. ప్రముఖ కవి, విమర్శకుడు,భాషావేత్త డాక్టర్ నలిమెలభాస్కర్ నానీల్లో రైతుల వ్యధలను కళ్ళకు కట్టాడు.
‘నాగలితో / తెడ్డు వేస్తున్నాడు/ దరికి చేరునో/రైతుబిడ్డ’
రైతు జీవితాన్ని ఆవిష్కరించిన నానీ ఇది. అతని జీవితమంతా నాగలితో ముడివేసుకునే ఉంటుంది. అలాంటి నాగలి మంచి పంటను పండిస్తే రైతు జీవితం ధన్యమవుతుంది. లేకపోతే జీవితమే అల్లకల్లోమవుతుందనే ధ్వనిని ఈ నానీలో వెల్లడించాడు. కాలం కలిసి రాకపోతే మనిషై నా, మానైనా ఒకటే. ఒకప్పుడు ధాన్యరాశులతో కళకళలా డే పంటపొలాలు నేడు బీళ్ళుగా మారటాన్ని అనేకమం ది కవులు నానీల్లో ఆవిష్కరించారు.ప్రముఖ కవి సోమేపల్లి వెంకటసుబ్బయ్య ‘రెప్పల చప్పుడు’లోని ఒక నానీలో ఇలా అంటాడు.
‘పొలం/ఒకప్పుడు వాడికుండే/‘కళ్ళం’ కళ తప్పి/గాదె వొట్టిపోయిందంతే’ ‘కళ్ళం’ కళ తప్పిందంటే పంట దిగుబడి రాలేదని, పంట సరిగా పండలేదని. పంట పండితేనే రైతన్నకు ఆనందం. దేశానికి సౌభాగ్యం. పల్లెలు మమతానురాగాల పల్లెకొమ్మలు. ఇప్పుడవి వాడిపోయిన వాసంతసమీరాలు. ఒకపుడు పల్లెలు ఎలా ఉండేవో చెబుతూ దాస్యం సేనాధిపతి ఇలా అంటాడు. ‘ఆత్మీయతానురాగాల/మమతలు పంచే/మన పల్లెలు/కాదనగలమా మనం’ ఇది ఎవరూ కాదనలేని నిజం. ఇప్పటికీ పల్లెకుపోతే అదే ఆత్మీయత కన్పిస్తుంది. కానీ,అప్పటి మనుషుల్లా నేటిమనుషులులేరన్నదే జీర్ణించుకోలేని సత్యం. ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ మట్టి స్వభావాన్ని నానీలలో చక్కగా ఆవిష్కరించాడు.తను పుట్టిన నేలను నానీల్లో సాక్ష్కాత్కరింపజేశాడు.ఇలా నానీలను ఎందరెందరో కవు లు కొత్తకొత్త అభివ్యక్తితో,వైవిధ్యంతో,విభిన్న అ ంశాలతో కొత్త రూపాలను సంతరించుకుంటూనే సాగిపోతోంది. ‘నానీల నాన్న’ అయిన డా.ఎన్.గోపి నానీల విత్తు వేస్తే కవులు మొగ్గలై, మొక్కలై, పూలై, రెమ్మలై , కొమ్మలై రెపరెపలాడుతూనే ఉన్నారు నానీల జెండాలను ఎగరేస్తూ.

డా॥ భీంపల్లి శ్రీకాంత్
9032844017

The post బలమైన కవితాప్రక్రియ ‘నానీలు’ appeared first on .