బన్నీకి జోడీగా నివేథా

  ‘నా పేరు సూర్య’ చిత్రం తర్వాత స్టార్ హీరో అల్లు అర్జున్ కాస్త గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ ఇటీవలే ప్రారంభమైంది. అల్లు అర్జున్‌తో గతంలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలను చేసిన త్రివిక్రమ్ ఇప్పుడు ఈ చిత్రంతో హ్యాట్రిక్ హిట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. ఈమధ్య కాలంలో […] The post బన్నీకి జోడీగా నివేథా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

‘నా పేరు సూర్య’ చిత్రం తర్వాత స్టార్ హీరో అల్లు అర్జున్ కాస్త గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ ఇటీవలే ప్రారంభమైంది. అల్లు అర్జున్‌తో గతంలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలను చేసిన త్రివిక్రమ్ ఇప్పుడు ఈ చిత్రంతో హ్యాట్రిక్ హిట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. ఈమధ్య కాలంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఎక్కువ సినిమాల్లో ఇద్దరు ముద్దుగుమ్మలు కనిపిస్తూ వస్తున్నాయి. సెకండ్ హీరోయిన్‌కు అంతగా ప్రాముఖ్యత ఇవ్వకున్నా కూడా తప్పకుండా ఇద్దరు హీరోయిన్లను మాత్రం తన సినిమాలో త్రివిక్రమ్ నటింపజేస్తున్నారు. ‘అరవింద సమేత’ చిత్రంలో పూజా హెగ్డేతో పాటు తెలుగమ్మాయి ఈషా ను నటింపజేశారు. ఇక తాజా చిత్రంలో బన్నీ కోసం పూజాతో పాటు నివేథా పేతురాజ్‌ను ఎంపిక చేసినట్లుగా తెలిసింది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో బన్నీ, పూజాలతో పాటు నివేథా కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందింది. ‘చిత్రలహరి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నివేథా పేతురాజ్ తన రెండవ సినిమాలోనే బన్నీతో నటిస్తుండడం విశేషం. అయితే నివేథాకు ఈ చిత్రంలో ఏ మేరకు దర్శకుడు త్రివిక్రమ్ ప్రాముఖ్యత ఇస్తారనేది చూడాలి.

The post బన్నీకి జోడీగా నివేథా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: