బదల్లు తెచ్చుకునుడు.. బదల్లు పోవుడు

బదల్లు పోవడు అనే పేరు విని ఉండకపోవచ్చు ఊర్లల్ల చేను పనిచెల్క పనులకు ఇంటి వాల్లతో పాటు కూలి కైకెలి వాల్లను కూడా పిలుస్తరు. అందరు కూలికే పోరు పక్కింటి వాల్లు ఎంతో కొంత ఎవుసం ఉన్న దగ్గరోల్లను బదల్లకు తీసిక పోయి పని చేయించుకుంటరు. ఓ నాలుగురోజు పక్క పొన్న ఇంటి ఆమె నాటేసేందుకు బదలు వచ్చిందనుకో ఈ ఇంటి ఆమె కూడ నాలుగు రోజు పక్క పొన్న ఇంటి ఆమె నాటేందుకు బదులు వచ్చిందనునకో […]

బదల్లు పోవడు అనే పేరు విని ఉండకపోవచ్చు ఊర్లల్ల చేను పనిచెల్క పనులకు ఇంటి వాల్లతో పాటు కూలి కైకెలి వాల్లను కూడా పిలుస్తరు. అందరు కూలికే పోరు పక్కింటి వాల్లు ఎంతో కొంత ఎవుసం ఉన్న దగ్గరోల్లను బదల్లకు తీసిక పోయి పని చేయించుకుంటరు. ఓ నాలుగురోజు పక్క పొన్న ఇంటి ఆమె నాటేసేందుకు బదలు వచ్చిందనుకో ఈ ఇంటి ఆమె కూడ నాలుగు రోజు పక్క పొన్న ఇంటి ఆమె నాటేందుకు బదులు వచ్చిందనునకో ఈ ఇంటి ఆమె కూడా నాలుగు రోజుల వాల్ల పొలంలో నాట్లేయపోయేది. దీంతోని కూలీలకు పైసలు ఇచ్చుడు కూడా తప్పుతది. ఇట్ల మద్య తరగతి ఎవసాయదార్లు ఎక్కువ చేసికుంటరు ఆ పైసలు బదులు తీసుకున్నట్టు మనుషుల పని రోజులను తెచ్చుకోవ్వడం ఈ సంప్రదాయం ఇప్పటికీ నడుస్తున్నదీ.

వస్తువులు బదులు తెచ్చుకుంటరు. ఇంట్ల చక్కరి చాపత్త అయిపోంటే పక్కింటికె పోయి అర్జంటుగా చిన్న మూతడు లేదా చిన్న గెంటెడుతెచ్చుకుంటరు. ఈ ఇట్ల చాలా వస్తువులు అమ్మలక్కలు తెచ్చకుంటరు. అట్లనే ఎవసాయందార్లు బండి, ఎడ్లు పగ్గం, జోల్లు, తాల్లు ఇట్ల ఎవ్వి అవసరం ఉంటే పక్కవాల్ల దగ్గర తెచ్చుకుంటరు ఒగలు అవసరం ఒగలు తీసికుంటరు. ఇండ్ల కూడ తీసుకున్న వస్తువు ఇయ్య కుండ దక్కించుకుంటరు నేను ఆనాడే ఇచ్చిన నా తానా లేదు అంటరు. ఇట్లాంటోల్ల రంగు ముందే అందరికి తెలుస్తది. వాల్లకు దూరం ఉండి. ఏదన్న వస్తువు అడిగితే నా దగ్గర లేదు. ఇంటి కాడ లేదు అని చెప్పతుంటరు. వస్తువులు అవసరార్దం తీసిక పోవుడు బదు తీసిక పోవడు కాగ అడుక్కచ్చుకునుడు కూడా ఉంటది.

అడుక్కవచ్చుకునుడు అంటే పుక్యానికే అడిగి కొంట పోవుడు అన్నట్టు. జర దగ్గరి వాల్లు ఇంట్ల పని చేసేవాల్ల వీల్ల పోలంలకు పనికి వచ్చే వాల్లు వీల్లకు ఎక్కువ ఉన్న వస్తువల బర్లకు ఏసే ఎండుగడ్డి లేదా పాత బట్టలు, ధాన్యం సుత అడుక్కవచ్చుకుంటరు. మక్కకోసినపుడు మా మనుమరాలు కొన్ని కంకులు ఇయ్యవూ అని పది ఇరవై గల తెచ్చుకుంటరు. తోల్ల పండిన మిరపకాయలు పల్లి కాయలు ఏది పడితే అది ఇచ్చే వాట్లు ఉంటే పుచ్చుకునేవాల్లు ఉంటరు. అయితే కొందరైతే మమా పిసినర్లు ఉంటరు. ఏ వస్తువ ఎవలకు ఇయ్యరు. మిగిలిన పడేస్తరు గని ఇంకొకలకు పుణ్యానికి ఇయ్యరు. ఒగల అంటు సటు లేకుంట ఉంటరు . వాల్ల గుణాలను బట్టి ఊరంతా ముందే తెలుస్తంది. దీంతోని వాల్లను పిల్లికి బిచ్చేం పెట్టరు అంటరు. వాల్లకు ఎవరు సహకరించరు కూడ. చిత్రంగా వాల్ల గుణాలే ఆ ఇంట్లో ఉన్న అందరికి వస్తయి.

బిచ్చం పెట్టుడు అంటే ఇంటి ముందలికి వచ్చే బిచ్చగాళ్లకు బువ్వ కూర పడేసుడు కాదు. కల్లం కాడ పనోల్లకు వడ్లిత్తులు. కొలిచి పోసుడును కూడ బిచ్చం అనే వ్యవహరించేది ఇప్పుడు ఇవన్ని లేవుగని చరిత్ర కోసం చెపుతున్న ముచ్చట్లు. కాపుదనపు వరి కల్లం కాడికి నాగలి బండి నాగలి గొర్రు అమ్మిచ్చిన వడ్లాయన వడ్ల కోసం వస్తడు. కర్రు గడ్డపార మొన పెట్టిన కమ్మరి ఆయన సుత వస్తడు అట్లనే సౌరం చేసే మంగలాయన సుత కుండలు ఇచ్చిన కుమ్మరాయన కల్లు పోసిన గౌండ్లాయన ఇట్ల. అక్కర మనుషులు అందరు గొంగల్లు పట్టుకొని వస్తరు. ఆసామి కుంచెతో కొలిచి పోస్తడు. బాగా పండితే ఇంకా ఎక్కువనే యేస్తరు.ఆ కాలంలో పైసలు కాకుండా కారు గిన్నె వడ్ల అనేది ఉండేది. ఒక్క వడ్లు కాదు జొన్నలు ఎవ్వి పండితే అవి కూడా ఇచ్చేది దీన్ని బిచ్చం అనేవాల్లు.వడ్ల, జొన్నలు ఇత్తనాలకు కావాలంటే లేకుంటే పెచ్చేలకు తెచ్చుడు ఉండేది. ఇప్పడు రూపాయలకు మిత్తికి తెచ్చుకున్నట్టు వడ్లను తెచ్చుకునేది. నాలుగు కుంచాల వడ్లు తెచ్చుకుంటే పంట పండినాక ఆరు కుంచాల పెట్టాలే. ఇట్లా రెండు కుంచాలు ఆయనకు లాభం. పెచ్చులకు తెచ్చుకుంటే బర్కత్ ఉండది అంటరు. ఏది ఏమైనా ఊరు ఒగలకు ఒగలు ఆసరయ్యేది.

-అన్నవరం దేవేందర్, 94407 63479

Comments

comments