బతుకమ్మ చీరల తయారీని పరిశీలించిన:కలెక్టర్

Examining the manufacture of Bathukamma sarees: Collector
మనతెలంగాణ/సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం కలెక్టర్ కృష్ణభాస్కర్ బతుకమ్మ చీరల తయారీని స్వయంగా పరిశీలించారు. రా ష్ట్ర ప్రభుత్వం సిరిసిల్లలో 90లక్షల బతుకమ్మ చీరల తయారీకి ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో శనివారం కలెక్టర్ బతుకమ్మ చీరల తయారీని పరిశీలించారు. ఈ సందర్భంగా కార్మికులతో ఆయన ముచ్చటించారు. కార్మికులు బతుక మ్మ చీరల వల్ల పొందుతున్న ఆదాయాన్ని అడిగి తెలుసుకున్నారు. బతుక మ్మ చీరలకు ముందు ప్రతి రోజు 350 నుంచి 400 రూపాయలు సంపాదించుకునే వారమని బతుకమ్మ చీరలు తయారీ ప్రారంభించిన తర్వాత రో జుకు 800 రూపాయలు కూలీ సంపాదించుకోగలుగుతున్నామని కార్మికు లు కలెక్టర్‌కు వివరించారు. నిర్ణీత గడువులోగా బతుకమ్మ చీరల తయారీ పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.

Comments

comments