బడి గోడ కూలి ఇద్దరు చిన్నారులు బలి

ఒకరు విషమం, నలుగురికి గాయాలు  హైదరాబాద్ కూకట్‌పల్లిలోని న్యూ సెంచరీ స్కూల్‌లో విషాదం మన తెలంగాణ/కూకట్‌పల్లి :  హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి న్యూ సెంచరీ స్కూల్  గోడ కూలిపోవడంతో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కూకట్‌పల్లి చిత్తారమ్మ ఆలయం ఎదురుగా ఉన్న రమణినగర్‌లో గల న్యూసెంచరీ స్కూల్‌లో గురువారం ఈ  విషాదం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి తడిసిన గోడ గురువారం మధ్యాహ్నం కూలిపోయింది. […]

ఒకరు విషమం, నలుగురికి గాయాలు  హైదరాబాద్ కూకట్‌పల్లిలోని న్యూ సెంచరీ స్కూల్‌లో విషాదం

మన తెలంగాణ/కూకట్‌పల్లి :  హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి న్యూ సెంచరీ స్కూల్  గోడ కూలిపోవడంతో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కూకట్‌పల్లి చిత్తారమ్మ ఆలయం ఎదురుగా ఉన్న రమణినగర్‌లో గల న్యూసెంచరీ స్కూల్‌లో గురువారం ఈ  విషాదం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి తడిసిన గోడ గురువారం మధ్యాహ్నం కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ 4వ తరగతి విద్యార్థులకు కరాటే శిక్షణ ఇస్తున్నారు. గోడ కూలడంతో ఏడుగురు విద్యార్థులు ఇనుప చువ్వ ల మధ్య చిక్కుకుని రక్తపు మడుగులో కొట్టుకున్నా రు.  చందన(8), మహి కీర్తిన(9) విద్యార్థులు మృ తి చెందగా  సందీప్, నిఖిత, నరేష్, దేవిశ్రీ గాయాలపాలై ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా రు. విద్యార్థుల తల్లిదండ్రులు  పాఠశాల వద్దకు చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న   పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.  మాదాపూర్ జోన్ డిసిపి వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంతో చిన్నపిల్లలు చనిపోవడం చాలా బాధకరమైన విషయమని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని తెలిపారు. అనంతరం కూకట్‌ప ల్లి ఎంఎల్‌ఎ మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎంఎల్‌ఎ గాంధీలు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి పిల్లల తల్లిదండ్రులకు నష్టపరిహారం చెల్లించి పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకునే విధంగా చూస్తామన్నారు. అదే విధంగా విషయం తెలిసిన వెంటనే వివిధ పార్టీలకు చెందిన నేతలు సంఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇలాంటి ఘటనలు మరోమారు పునరావృతం కాకుండా చూడాలని తెలిపారు.
విద్యార్థి సంఘాల ఆందోళన… విద్యార్థిలు మరిణించిన విషాద సంఘటన విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు సంఘటన స్థలంలో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు లంచాలకు అలవాటు పడి ప్రైవేట్ పాఠశాలలను పట్టించుకోకపోవడంతో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాదిగ విద్యార్థి సంఘం జెఎసి నాయకులు చిరుమర్తి రాజు మాదిగ, ఎన్‌ఎస్‌యూఐ మోహిజ్, టిఎన్‌ఎస్‌ఎఫ్ శివ, ప్రసాద్, ఎబివిపి, బిజెపి నాయకులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: