బంగ్లాదేశ్ క్రికెటర్‌పై వరకట్న వేధింపుల కేసు

ఢాకా: బంగ్లాదేశ్ క్రికెటర్ మొసద్దక్ హుస్సేన్ సైకత్ (22)  పై వరకట్నం వేధింపుల కేసు వేసింది. మొసద్దక్ అతని భార్య కజిన్ షర్మిన్ సమీరా ఉషను ఆరేళ్ల కిందట పెళ్లి జరిగింది. వరకట్నం కోసం ఉషను శరీరకంగా వేధిస్తున్నాడని ఆమె తెలియజేసింది. వచ్చే నెలలో జరగనున్న ఏషియా కప్ కోసం బంగ్లాదేశ్ సెలక్టర్లు అతనికి టీమ్‌లో చోటు కల్పించారు. హుస్సేన్ కట్నం కోసం హింసిస్తున్నట్టు అతని భార్య కేసు వేసినట్టు అడిషనల్ చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ రోసినా ఖాన్ […]

ఢాకా: బంగ్లాదేశ్ క్రికెటర్ మొసద్దక్ హుస్సేన్ సైకత్ (22)  పై వరకట్నం వేధింపుల కేసు వేసింది. మొసద్దక్ అతని భార్య కజిన్ షర్మిన్ సమీరా ఉషను ఆరేళ్ల కిందట పెళ్లి జరిగింది. వరకట్నం కోసం ఉషను శరీరకంగా వేధిస్తున్నాడని ఆమె తెలియజేసింది. వచ్చే నెలలో జరగనున్న ఏషియా కప్ కోసం బంగ్లాదేశ్ సెలక్టర్లు అతనికి టీమ్‌లో చోటు కల్పించారు. హుస్సేన్ కట్నం కోసం హింసిస్తున్నట్టు అతని భార్య కేసు వేసినట్టు అడిషనల్ చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ రోసినా ఖాన్ వ్యక్త తెలియజేశారు. చాలా రోజులుగా ఉషను కట్నం కోసం వేధిస్తున్నట్టు ఆమె తరపు లాయర్ రెజౌల్ కరీమ్ దులాల్ వివరించారు. అయితే దీనిపై విచరణ చేయాల్సిందిగా సదర్ ఉపజిలా ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ ను నియమించారు. పది లక్షల టాకాలు (రూ. 834696.79) కట్నంగా ఇవ్వాలంటూ హింసించేవాడని, ఇద్దరి మధ్య పెళ్లి అయినప్పటి నుండి పొసగడం లేదని ఆమె సోదరుడు తెలిపారు. అయితే ఆగస్టు 15న ఆమె విడాకులు కావాలంటూ కోర్టు నుంచి భర్తకు నోటిసులు పంపించింది. దీనిపై ఇప్పటి వరకు హుస్సేన్ స్పందించలేదు.

Comments

comments

Related Stories: