బంగారు తెలంగాణలో బాగుపడని బెజ్జూర్

బస్టాండ్ లేక ప్రజల ఇబ్బందులు వారసంత బురదమయం వెలుగని విద్యుత్ దీపాలు పట్టించుకోని అధికారులు, పాలకులు మన తెలంగాణ/బెజ్జూర్ : కుమ్రం భీం జిల్లాలోని బెజ్జూర్ మండలకేంద్రం బంగారుతెలంగాణలో బాగుపడలేదని మం డల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారసంతకు ప్రతీ సంవత్సరం వేలం పాట ద్వారా ఆదాయం వచ్చినప్పటికి వా రసంత అభివృద్ధికి ఉపయోగించడంలో అధికారులు విఫలమయ్యారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కురుస్తున్న వర్షాలకు ప్రతి ఆదివారం నిర్వహించే వారసంత అం తా బురదమయం […]

బస్టాండ్ లేక ప్రజల ఇబ్బందులు
వారసంత బురదమయం
వెలుగని విద్యుత్ దీపాలు
పట్టించుకోని అధికారులు, పాలకులు

మన తెలంగాణ/బెజ్జూర్ : కుమ్రం భీం జిల్లాలోని బెజ్జూర్ మండలకేంద్రం బంగారుతెలంగాణలో బాగుపడలేదని మం డల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారసంతకు ప్రతీ సంవత్సరం వేలం పాట ద్వారా ఆదాయం వచ్చినప్పటికి వా రసంత అభివృద్ధికి ఉపయోగించడంలో అధికారులు విఫలమయ్యారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కురుస్తున్న వర్షాలకు ప్రతి ఆదివారం నిర్వహించే వారసంత అం తా బురదమయం కావడంతో వ్యాపారులు ఆందోళన చెం దుతున్నారు. ప్రతీ ఆదివారం వ్యాపారుల వద్ద డబ్బులు వ సూలు చేయడంలో చూపిస్తున్న శ్రద్ధ వ్యాపారులు కూర్చునే ప్రాంతం బాగుచేయడంలో చూపించడం లేదని ఆరోపిస్తున్నారు. బెజ్జూర్, తలాయి, కమ్మర్‌గాం, సోమిని గ్రామాలకు ప్రతినిత్యం పదుల సంఖ్యలో వస్తుంటాయి. ప్రయాణికులు బస్సులలో మండల కేంద్రానికి వందల సంఖ్యలో వస్తుంటారు. కానీ ప్రయాణికుల కోసం మండల కేంద్రం ఏర్పడి సంవత్సరాలు గడిచినప్పటికి బస్టాండ్ లేకపోవడంతో వివిధ గ్రామాల, మండలాల, జిల్లాల నుండి వచ్చిన ప్రజలు ఏ బ స్సు ఎక్కడ ఆగుతుందో తెలియని పరిస్థితిగా మారింది. అంతే కాకుండా వచ్చిన ప్రయాణికులకు మూత్రశాలలు, మరుగుదొడ్లు లేకపోవడంతో ఎటు వెళ్లాలో తెలియని ఆయోమయ పరిస్థితిగా మారిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలో ప్రధాన రహదారికి ఇరువైపుల గ్రామంలోపల విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యుత్ అధికారులు విద్యుత్ దీపాల కనెక్షన్ తొలగించి నెలలు గడుస్తున్నప్పటికి బకాయిలు చెల్లించకపోవడంతో విద్యుత్ అధికారులు విద్యుత్ బల్బులకు సరఫరా నిలిపివేశారు. దీంతో బస్టాండ్ ప్రాంతంలో చీకటి మయంగా మారింది. బెజ్జూర్ మండల పరిషత్ కార్యాలయంలో కొన్ని రోజుల క్రితం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ వీధి దీపాలకు ఎల్‌ఈడి లైట్లు బిగించాలని గ్రామ పంచాయతీ అధికారులకు సూచించినప్పటికి ఆచరణలో మాత్రం ఇప్పటి వరకు లేకపోవడంతో విడ్డూరంగా ఉందని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా ఉన్న బల్బులే వెలుగని వైనంగా మారింది. ఎంఎల్‌ఎ కృషితో ఎక్కడ లేని విధంగా బెజ్జూర్ ప్రధాన రహదారి సీసీ రోడ్డు నిర్మించినప్పటికి ప్రధాన రహదారికి ఇరువైపుల మురికి కాలువలు లేకపోవడంతో ప్రతీ సంవత్సరం తాత్కాలిక మురికి కాలువలు తీయడంతో తీసిన మట్టి సీసీ రోడ్డుపై వేయడంతో లక్షల రూపాయలతో రోడ్డు నిర్మించినప్పటికి తీసిన మట్టి తొలగించకపోవడంతో రోడ్డంతా బురదమంగా మారింది. వర్షాకాలం ప్రారంభమై నెలరోజులు గడిచినప్పటికి పలు కాలనీల్లో మురికి కాలువలోని చెత్తాచెదారం తొలగించకపోవడంతో పలు కాలనీలు కంపుకంపుగా మారాయి. బావులలో బ్లీచింగ్ పౌడర్, దోమల నివారణ పిచికారి మందు చేపట్టడం మర్చారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది ఇటీవల బదీలీపై వెళ్లడంతో సిబ్బంది లేక రోగులు దూర ప్రాంతాలకు వెళ్లాన్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. పేద ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లలేక మెరుగైన వైద్యం చేయించుకోలేక ఇంట్లోనే బాధపడుతున్నారు. గాంధీ చౌక్ ప్రాంతంలో మురికి కాలువ తీయడంతో 108,102 వాహనాలు ఆసుపత్రికి వెళ్లాలంటే ఇబ్బందిగా మారిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా పశుపోషకులు పశువులను ఇండ్లలో బంధించకపోవడంతో బస్టాండ్ ప్రాంతంలో ప్రధాన రహదారిపై ఉండడంతో ప్ర యాణికులు నానా తంటాలు పడుతున్నారు. అంతే కాకుం డా వారసంతలో సంచరించి అటు వ్యాపారులను, ఇటు కొనుగోలు దారులను ఇబ్బంది చేస్తున్నాయి. మరోవైపు పం ట పొలాల్లో సంచరించి పంటలను నష్టం చేస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మండల అభివృద్ధికి కృషిచేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Comments

comments

Related Stories: