ఫ్రెండ్‌షిప్‌కు, లవ్‌కు మధ్య తేడా

Marutiవైభవ్, సోనమ్ బాజ్వా జంటగా రూపొందిన తమిళ చిత్రం ‘కప్పల్’ను తెలుగులో ‘పాండవుల్లో ఒకడు’ పేరుతో అనువదించి ఇటీవల విడుదల చేశారు. ఎస్.పిక్చర్స్ సమర్పణలో మారుతి టాకీస్ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరాభిమానాలతో మంచి కలెక్షన్లను సాధిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మారుతి హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ “చిన్న సినిమా అయినప్పటికీ ‘పాండవుల్లో ఒకటి’ మంచి విజయం సాధించి కలెక్షన్లు బాగా వస్తున్నాయి. డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఆనందంగా ఉన్నారు. తమిళ్‌లో హీరోగా నిరూపించుకున్న వైభవ్ ఈ చిత్రంతో తెలుగులో మంచి హిట్ కొట్టి కథానాయకుడిగా పేరుతెచ్చుకున్నాడు. ముందుగా ఈ సినిమాను రీమేక్ చేయమని కొందరు అడిగారు. సినిమా చూసిన తర్వాత డబ్బింగ్ చేయడం మంచిదనుకున్నాం. డబ్బింగ్ తెలుగు సినిమాలా రావడంతో ప్రేక్షకుల ఆదరణతో సినిమా మంచి విజయాన్ని సాధించింది. ప్రేమిస్తే తర్వాత మరోసారి ప్రముఖ దర్శకుడు శంకర్ సమర్పణలో విడుదల చేసిన ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఫ్రెండ్‌షిప్‌కు, లవ్‌కు మధ్య ఉన్న తేడాను తెలియజేసే చిత్రం ‘పాండవుల్లో ఒకడు’. యూత్‌ఫుల్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. వైభవ్ యాక్షన్ చాలా బాగుంది. తను కామెడీతో ప్రేక్షకులను నవ్వించాడు. ఫ్రెండ్‌షిప్ డేను పురస్కరించుకొని రిలీజైన సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అపూర్వ స్పందన లభించింది. సినిమాలో మ్యూజిక్ హైలైట్‌గా నిలిచింది”అని అన్నారు.

Comments

comments