ఫోటో గ్రాఫర్ రవీందర్ కుటుంబానికి ఆర్థిక సహాయం

కమాన్‌పూర్: మండల కేంద్రానికి చెందిన ఫోటో గ్రాఫర్ బుర్ర రవీందర్ ఇటీవల గోదావరిఖని నుంచి స్వగ్రామమైన కమాన్‌పూర్‌కు వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సదరు మృతుని కుటుంబ సభ్యులకు ఫోటో గ్రాఫర్ అసోషియేషన్ ఆధ్వర్యంలో గురువారం రూ॥ 28 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. టిపివిపిఎ అభయ్ ద్వారా రూ॥ 8,000, కమాన్‌పూర్ ఫోటో గ్రాఫర్ అసోషియేషన్ రూ॥ 5,000 లతో పాటు 50 కేజీల బియ్యం, టిజి పివిడబ్యూ రూ॥ 5,000, పెద్దపల్లి […]

కమాన్‌పూర్: మండల కేంద్రానికి చెందిన ఫోటో గ్రాఫర్ బుర్ర రవీందర్ ఇటీవల గోదావరిఖని నుంచి స్వగ్రామమైన కమాన్‌పూర్‌కు వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సదరు మృతుని కుటుంబ సభ్యులకు ఫోటో గ్రాఫర్ అసోషియేషన్ ఆధ్వర్యంలో గురువారం రూ॥ 28 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. టిపివిపిఎ అభయ్ ద్వారా రూ॥ 8,000, కమాన్‌పూర్ ఫోటో గ్రాఫర్ అసోషియేషన్ రూ॥ 5,000 లతో పాటు 50 కేజీల బియ్యం, టిజి పివిడబ్యూ రూ॥ 5,000, పెద్దపల్లి జిల్లా అసోషియేషన్ 50 కేజీల బియ్యం, సిద్దిపేట పిత్రేటీం 10,000ల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టిపివిపిఎ రాష్ట్ర గౌరవ సలహాదారులు దయానంద్‌గాంధీ, రాష్ట్ర ఉపాధ్యాక్షులు ఎదులపురం సుధీర్, గోదావరిఖని అసోషియేషన్ జనరల్ సెక్రటరీ గాలి సంతోష్, సలహాదారులు దబ్బెట శంకర్, కమాన్‌పూర్ మండల ఫోటో గ్రాఫర్ అసోషియేషన్ ప్రెసిడెంట్ సందవేన నాగరాజు, ప్రధాన కార్యదర్శి బత్తుల రాజు, గౌరవ అధ్యక్షులు వడ్లకొండ తిరుపతి, శ్రీనివాస్‌లతో పాటు తదితరులు ఉన్నారు.

Comments

comments

Related Stories: