ఆసియా మహిళా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ
డోంఘే సిటీ(కొరియా): డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన భారత మహిళా హాకీ జట్టు గురువారం మహిళా ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో మలేషియాను 32తో వరుసగా మూడో విజయాన్ని చేజిక్కించుకుంది. దీనికి ముందు భారత జట్టు జపాన్ను 41, చైనాను 31తో ఓడించింది. భారత మహిళా హాకీ జట్టు ఈ మూడు వరుస విజయాలతో తన పూల్ నుంచి ఫైనల్లోకి ప్రవేశించింది. తొమ్మిది పాయింట్లతో పట్టిక జాబితాలో అగ్రస్థాయిలో ఉంది. భారత్ తరఫున గుర్జిత్ కౌర్(17’), వందన కత్రియా(33’), లాల్రెమ్సియామి(40’) బాగా ఆడగా, మలేషియా తరఫున నూరైనీ రషీద్(36’), హనీస్ ఓన్(48’) స్కోరు చేశారు. 40వ నిమిషంలో చేసిన గోల్ భారత్కు 31 ఆధిక్యతను సాధించిపెట్టింది. మలేషియా తరఫున హనీస్ రెండో గోల్ స్కోరు చేసినప్పటికీ వారు భారత్ జట్టు స్కోరుకు సమం చేయలేకపోయారు. కాగా ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్కు ముందు తమ పూల్ ఫైనల్ మ్యాచ్లో ఆతిథేయ జట్టు కొరియాతో తలపడనున్నది.
Comments
comments