ఫైనల్స్‌కు దూసుకెళ్లిన పాకిస్థాన్

కార్డిఫ్ : ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ జట్టు ఫైనల్స్‌కి దూసుకెళ్లింది. ఆతిధ్య ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 10 వికెట్లు నష్టపోయిన 211 పరుగులు చేసింది. 212 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పాక్ ఆటగాళ్లు ఆది నుంచి దూకుడు ప్రదర్శించారు. ఓపెనర్లు అజర్ (76), జమాన్ (57) తొలి వికెట్‌కు 118 పరుగులు రికార్డు భాగస్వామ్యాన్ని […]

కార్డిఫ్ : ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ జట్టు ఫైనల్స్‌కి దూసుకెళ్లింది. ఆతిధ్య ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 10 వికెట్లు నష్టపోయిన 211 పరుగులు చేసింది. 212 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పాక్ ఆటగాళ్లు ఆది నుంచి దూకుడు ప్రదర్శించారు. ఓపెనర్లు అజర్ (76), జమాన్ (57) తొలి వికెట్‌కు 118 పరుగులు రికార్డు భాగస్వామ్యాన్ని అందిచారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆజామ్ (38), హఫీజ్ (31) అద్భుతమైన బ్యాటింగ్‌ను కనబరిచారు. దీంతో పాకిస్థాన్ 37.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లో పాక్ స్థానాన్ని సంపాదించుకుంది. గురువారం భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగే మ్యాచ్‌లో విజేత ఆదివారం ఫైనల్స్‌లో పాక్‌తో తలపడుతుంది.

Comments

comments

Related Stories: