ఫైనల్లో రోహిత్ సేన

చలరేగిన  బుమ్రా, కర్ణ్‌శర్మ, కృనాల్   కోల్ కతా  చిత్తు ఉప్పల్‌లో  పుణెతో తుది పోరు బెంగళూరు: ముంబయి ఇండియన్స్ ఐపిఎల్-10లో టైటిల్ సమరానికి దూసుకెళ్లింది. శుక్రవా రం ఏకపక్షంగా సాగిన క్వాలిఫయర్-2లో ముంబయి ఆరు వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు చేరింది. ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే ఫైనల్లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్‌తో తలపడుతుంది. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో […]

చలరేగిన  బుమ్రా, కర్ణ్‌శర్మ, కృనాల్  

కోల్ కతా  చిత్తు

ఉప్పల్‌లో  పుణెతో తుది పోరు

బెంగళూరు: ముంబయి ఇండియన్స్ ఐపిఎల్-10లో టైటిల్ సమరానికి దూసుకెళ్లింది. శుక్రవా రం ఏకపక్షంగా సాగిన క్వాలిఫయర్-2లో ముంబయి ఆరు వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు చేరింది. ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే ఫైనల్లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్‌తో తలపడుతుంది. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. తొలుత నైట్‌రైడర్స్‌ను 107 పరుగు లకే కట్టడి చేసింది. తర్వాత స్వల్ప లక్ష్యాన్ని 14.3 ఓవర్లలోనే కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఒక దశలో 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కాస్త చిక్కుల్లో పడినట్టు కనిపించింది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ, కృనాల్ పాండ్యా అద్భుత ఆటతో జట్టును సురక్షిత స్థితికి చేర్చారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ 26 పరుగులు చేశాడు. మరోవైపు కృనాల్ 8ఫోర్లతో ౩౦ బంతుల్లోనే అజేయంగా 45 పరుగులు చేసి జట్టు విజయంలో ము ఖ్య భూమిక పోషించాడు.
ప్రారంభంలోనే..
టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన కోల్‌కతాకు ప్రారంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్ క్రిస్ లిన్ (4)ను బుమ్రా వెనక్కి పంపాడు. కొద్ద సేపటికే మరో ఓపెనర్ సునీల్ నరైన్ కూడా పెవిలియన్ చేరాడు. కర్ణ్ శర్మ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన నరైన్‌ను పార్థివ్ స్టంపౌట్ చేశాడు. ఆ వెంటనే ప్రమాదకర ఆటగాడు ఉతప్పను బుమ్రా వెనక్కి పంపాడు. మరవైపు కర్ణ్ శర్మ రెండు వరుస బంతుల్లో గంభీర్ (12), గ్రాండొ మ్ (౦)లను ఔట్ చేశాడు. దీంతో కోల్‌కతా 31 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. ఈ దశలో జట్టును ఆదుకునే బాధ్యతను ఇషాంక్ జగ్గి, సూర్యకుమా ర్ యాదవ్ తమపై వేసుకున్నారు. ఇద్దరు కుదు రుగా ఆడుతూ స్కోరుకు ముందుకు తీసుకెళ్లారు. ఇదే క్రమంలో ఆరో వికెట్‌కు 50 పరుగుల భాగసామ్యాన్ని కూడా నమోదు చేశారు. అయితే ప్రమాదకరంగా కనిపిస్తున్న ఈ జోడీని కర్ణ్ శర్మ విడగొట్టాడు. మూడు బౌండరీలతో 28 పరుగులు చేసిన జగ్గిని అతను వెనక్కి పంపాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ రెండు ఫోర్లు, సిక్స్‌తో 31 పరుగులు చేశాడు. చివర్లో ముంబయి బౌలర్లు మరోసారి చెలరేగడంతో కోల్‌కతా ఇన్నింగ్స్ 18.5 ఓవర్లలో 107 పరుగులకే ముగిసింది. ముంబయి బౌలర్లలో కర్ణ్ శర్మ నాలుగు, బుమ్రా మూడు వికెట్లు పడగొట్టారు. జాన్సన్‌కు రెండు, మలింగకు ఒక వికెట్ లభించింది.

Comments

comments

Related Stories: