ఫేస్‌బుక్‌ లైవ్‌లో పెళ్లి..

Marriage on Facebook Live is not an adult objection

బెంగళూరు : ఓ ప్రేమజంట ఫేస్ బుక్ వేధికగా పెళ్లి చేసుకున్న సంఘటన కర్ణాటకలోని మధుగిరిలో చోటుచేసుకుంది.  వివరాల్లోకి వెళ్ళితే… మధుగిరిలోని జెడిఎస్‌ నేత తిమ్మరాజు కుమార్తె అయిన అంజన డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. స్థానిక గిరిజన ప్రాంతానికి చెందిన వ్యాపార వేత్త కిరణ్‌ కుమార్‌, అంజన కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి విషయం ఇంట్లో చెప్పితే వధువు కుటుంబ సభ్యులు కిరణ్ ను కులం పేరుతో  దూషించారు. దీంతో వీరికి వేరే దారిలేక సామాజిక మాధ్యమాల సాక్షిగా ఆగస్టు 10న ఫేస్ బుక్ లైవ్ లో బెంగళూరులో హిసరఘట్టి వద్ద పెళ్లి చేసుకున్నారు.

మరోవైపు తిమ్మారాజు తన కూతురు కనిపించడం లేదంటూ.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వధువు వరులు పెళ్లి చేసుకొని తిమ్మరాజు ఇంటికి వెళ్లితే ఇంట్లోకి రానీయకపోవడంతో వధువు వరులు పోలీసులను ఆశ్రయించారు. ప్రేమ జంటను విచారించగా కిరణ్ కు 25 సంవత్సరాలు, అంజనకు 19 సంవత్సరాలు వీరి పెళ్లిని అడ్డుకోవడానికి విలులేదని ఇరువురి తల్లిదండ్రులకు తేల్చి చేప్పారు. సామాజిక మాధ్యమాల వేధికగా వీరిద్దరి పెళ్లికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.