ఫేమస్ గణపతి టెంపుల్స్ …

 

భారతదేశంలో వినాయకుడిని గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు, గణనాధుడు, ఏకదంతుడు, పిల్లైయార్ వంటి అనేక నామాలతో  పిలుస్తారు. అనేక ధార్మిక, లౌకిక కార్యక్రమాలలో విఘ్నేశ్వరుడిని పూజించడం సర్వసాధారణం. ఏదైనా పూజ లేదా వ్రతం చేసేటపుడు ముందుగా ఏకదంతుడిని పూజిస్తారు గనుక వినాయకుడిని “ప్రధమపూజ్యుడు” అంటారు.

Sri-Ganapathi-Devalayam-in-

తెలంగాణలోని హైదరాబాద్ రాజధాని సికింద్రాబాద్ లో  శ్రీ గణపతి దేవాలయం ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉంది. తెలంగాణలో అత్యంత రద్ధీ గల వినాయక దేవాలయాల్లో ఇది తొలి స్థానంలో ఉంది. ఎంజిబిఎస్ బస్ స్టేషన్ నుంచి 10 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం ఉదయం 11 గంటలకు నిత్యకల్యాణం, రాత్రి 8.20 కి గణపతి హోమం జరుగుతుంది. ఈ ఆలయంలో ఉన్న వినాయకుడు అత్యంత మహిమన్మితులు, కోరికలు తీర్చే కొంగు బంగారంగా భక్తులు నమ్ముతారు. 18వ శతాబ్దంలో బ్రిటిషు అధికారులు బావి తవ్వుతుండగా గణపతి విగ్రహం లబించిందని, అదే స్థలంలో దేవాలయం నిర్మించినట్టు సమాచారం.

Kanipaka-vinayaka-temple

కాణిపాకం ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో ఉంది. చిత్తూరు జిల్లా కేంద్రం నుంచి తిరుపతి -బెంగళూరు జాతీయ రహదారిపై కాణిపాకం 12 కిలో మీటర్ల దూరంలో ఉంది. వికలాంగులుగా ఉండే ముగ్గురు అన్నదమ్ములు వ్యవసాయం చేస్తుండగా బావిలో నీరు అయిపోయింది.  దీంతో అన్నదమ్ములు బావిని లోతు తీయ్యాలని నిర్ణయం తీసుకుంటారు. ముగ్గురు బావిలోకి దిగి తవ్వుతుండగా గట్టి రాయి గడ్డపారకు తగులుతుంది. తవ్వని దగ్గర నుంచి రక్తం కారుతుంది. రక్తాన్ని వారు ముట్టుకోగానే అవిటితనం పోతుంది. అప్పుడు  చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా వచ్చి  వినాయకుడికి పూజలు చేశారు. కాణి అంటే పావు ఎకరం.. పారకం అంటే నీళ్లు పొలంలోకి పారటం. కాణిపారకం క్రమేషా కాణిపాకంగా మారింది.

 

Sidhi-vinayaka-in-mumbai

మహారాష్ట్రాలోని ముంబయి రాజధాని ప్రభావతి ప్రాంతంలో సిద్ధి వినాయక దేవాలయం ఉంది. భారత దేశంలో ఉన్న గణపతి దేవాలయాల్లో అత్యంత ఐశ్వర్యవంతమైంది. ఈ దేవాలయం నవంబర్ 19, 1801 లో లక్ష్మణ్ వితు హాంరియు దుబాయ్ పాటిల్ నిర్మించాడు.  ఈ ఆలయంలో వినాయకుని ఎత్తు 2.6 అడుగులు ఉంది. వినాయకుని తొండం కుడివైపుకు తిరిగి వుండడము ఈ ఆలయం ప్రత్యేకత.

 

 

siddhatek-temple-in-maharas

మహారాష్ట్రాలో వున్న అష్ఠ గణపతి మందిరాలలో సిద్దటేక్ సిద్దివినాయకుడు రెండవదిగా పిలుస్తారు. సిద్ధటేక్ సిద్దివినాయకుడు పూణే నగరం నుంచి సుమారు 55 కిలో మీటర్ల దూరంలో షోలాపూర్ రోడ్డు మీదుగా వెళ్తే భీమా నదికి ఉత్తర తీరాన అహ్మద్ నగర్ జిల్లాలో కర్జాత్ తాలుకాలో వున్న సిద్ధటేక్ గ్రామానికి ఒక కిలొమీటరు దూరంలో  చిన్న గుట్టపై సిద్దివినాయక మందిరం ఉంది. ఇక్కడ గణపతి తొండం కుడివైపునకు తిరిగి ఉంటుంది. కుడి వైపున తొండ ఉన్న వినాయకుడికి అత్యంత శక్తులు ఉంటాయని పూజారులు, భక్తులు నమ్ముతారు.

Comments

comments