ఫుట్‌బోర్డు ప్రయాణం.. యువకుడు మృతి…

హైదరాబాద్: బస్సు ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తూ కిందపడి తీవ్ర గాయాలపాలైన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. యూసుఫ్‌గూడ శ్రీరామ్‌నగర్‌కు చెందిన షేక్ ముక్తియార్ కుమారుడు షేక్ అజాహర్ ఈ నెల 3న బస్సులో వెళ్తుండగా పంజాగుట్ట షాలీమార్ జంక్షన్ వద్ద ఫుట్‌బోర్డు మీద నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో తోటి ప్రయాణికులు అజాహర్ ను చికిత్స కోసం నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మంగళవారం మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు […]

హైదరాబాద్: బస్సు ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తూ కిందపడి తీవ్ర గాయాలపాలైన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. యూసుఫ్‌గూడ శ్రీరామ్‌నగర్‌కు చెందిన షేక్ ముక్తియార్ కుమారుడు షేక్ అజాహర్ ఈ నెల 3న బస్సులో వెళ్తుండగా పంజాగుట్ట షాలీమార్ జంక్షన్ వద్ద ఫుట్‌బోర్డు మీద నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో తోటి ప్రయాణికులు అజాహర్ ను చికిత్స కోసం నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మంగళవారం మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments

Related Stories: