ఫీ.. జులుం

తల్లిదడ్రులను నిలువు దోపిడీ చేస్తున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యాశాఖ అధికారుల నియంత్రణ కరువు వేలల్లో ఫీజులు వసూళ్లు సౌకర్యాలు నిల్.. వసూళ్లు ఫుల్ అనుమతులు లేని పాఠశాలలపై నిఘా కరువు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలల్లో అమరుతున్న సౌకర్యాలు మెరుగుపడుతున్న ప్రమాణాలు మన తెలంగాణ/మహబూబ్‌నగర్: సర్కార్ బడుల్లో నాణ్యమైన విద్య ఉండదన్న ప్రజల అపోహాను ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంపై ప్రత్యేక […]

తల్లిదడ్రులను నిలువు దోపిడీ చేస్తున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు
విద్యాశాఖ అధికారుల నియంత్రణ కరువు
వేలల్లో ఫీజులు వసూళ్లు
సౌకర్యాలు నిల్.. వసూళ్లు ఫుల్
అనుమతులు లేని పాఠశాలలపై నిఘా కరువు
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
ప్రభుత్వ పాఠశాలల్లో అమరుతున్న సౌకర్యాలు
మెరుగుపడుతున్న ప్రమాణాలు

మన తెలంగాణ/మహబూబ్‌నగర్: సర్కార్ బడుల్లో నాణ్యమైన విద్య ఉండదన్న ప్రజల అపోహాను ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సర్కార్ బడు ల్లో నాణ్యమైన విద్యను అందిస్తోంది. ప్రైవైట్ పాఠశాలలకు ధీటుగా సర్కార్ బడులు మారుతున్నాయి. ప్రభు త్వ పాఠశాలలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటు ఉపాధ్యాయుల తీరులో కూడా మార్పులు వస్తుండడంతో నాణ్యమైన విద్య అందుతోంది.సర్కార్ బడుల్లో హాజరు శాతం పెంచేందకు పిల్లలకు మధ్యాహ్నం సన్నబియ్యం అన్నం కూడా ప్రభుత్వం వడ్డిస్తోంది.అనేక పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తోంది. ఇప్పడిప్పుడే సర్కార్ బడులపై ప్రజలు ఆలోచన తీరు కూడా మారుతోంది. తమ పిల్లలు తమ లాగా కాకూడదని, ఉన్నత విద్యనందించాలన్న తల్లిదండ్రుల అమాయకత్వాన్ని, ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలన్న ఇష్టాన్ని ఆసరా చేసుకుంటున్న ప్రైవేట్ పాఠశాలలు నిలువు దోపిడికి పాల్పడుతున్నాయి. అందమైన బ్రోచర్లు ముద్రించి ప్రజలను తమ వలలో వేసుకుంటున్నారు. ట్యూషన్ ఫీజు, అడ్మిషన్ పీజుల పేరుతో వేలాది రూపాయల ఫీజులు గుంచుతున్నారు. ఈ ఫీజులు చెల్లించలేని మద్యతరగతి తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం అప్పలు పాలవుతున్నారు.ప్రవేట్ ఫీజుల దోపిడికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో దాదాపు 1500 కు పగా ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి.నిబంధనల మేరకు పాఠశాలకు అనుమతులు ఇవ్వాలంటూ సంబందిత పాఠశాలకు ఆట స్థలం ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఫైర్ అనుమతులు తప్పనిసరి, ప్రతి 50 మంది పిల్లలకు కలిపి ఒక టాయిలెట్ ఉండాలి.ఫీజుల వివరాలు నోటీస్ బోర్డులో ఉంచాలి.అదేవిధంగా మెడికల్ కిట్స్ అందుబాటులో ఉండాలి. ఉపాధ్యాయుల వేతన వివరాలు, వారి విద్యార్హతలు బోర్డులో డిస్‌ప్లే చూపించాలి.తరగతి గదులు శుభ్రంగా వెలుతురు వచ్చేలా ఉండాలి. ఏదైనా ప్రమాదం జరిగితే తక్షణమే బయటపడేలా సేఫ్టీ ఏర్పాటు చేయాలి. పాఠశాలలో ఫీజుల విషయంలో విద్యార్థుల తల్లిదండ్రుల కమీటిని ఏర్పాటు చేసి ప్రతి మూడు నెలలకొకసారి సమావేశం నిర్వహించి వారి సలహాలు,సూచనలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ఎన్నో నిబంధనలు ఉన్నాయి.అయితే కేవలం కొన్ని పాఠశాలల్లో మినహా అనక ప్రైవేట్ పాఠశాల్లో నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. సరైన ఆట స్థలాలు లేక పోవడం, ఒకే గదిలో ఎక్కువ మందిని కూర్చోబెట్టడం, మరుగుదొడ్లు లేక పోవడం వంటి అనేకం ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రైవేట్ పాఠశాలల అనుమతికి ఎంఇఓ ప్రతిపాదనలు పంపగా డిఇఓ అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుంది.అయితే ఎలాంటి నిబంధనలు లేకున్నప్పటికీ విద్యాశా అధికారులు మామూళ్లు తీసుకొని అనుమతులు ఇస్తున్నారు. ఫీజుల విషయంలో నియంత్రణ లేక పోవడంతో ఇష్టారాజ్యంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూళ్లుకు పాల్పడుతున్నారు.యుకెజి, ఎల్‌కెజి పిల్లలకు అడ్మిషన్ ఫీజులు, ట్యూషన్ పీజు, ధరఖాస్తులు ఫీజులు వంటి వాటికి ఏడాదికి 30 వేల నుంచి 50 వేలు వసూళ్లు చేస్తున్న పాఠశాలలు కూడా ఉన్నాయి. కొన్ని పాఠశాలల్లో ఎలాంటి నాణ్యమైన విద్య లేక పోయినప్పటికీ ఏడాదికి రూ. 20 వేలు వసూళ్లు చేస్తున్నారు.ఇక 5 నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ. 50 వేల నుంచి లక్ష రూపాయల దాక గుంజుతున్నారు. ప్రతి ఏడాది ఫీజులు ధరలు పెంచుతూ ఇష్టారాజ్యంగా ప్రజలను గుంజుతున్నారు. కార్పోరేట్ పాఠశాలల పేరుతో విద్యా వ్యాపారం చేసుకుంటున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు మాత్రం కోట్లకు గడిస్తున్నారు. అందులో విద్యను చెప్పే ఉపాధ్యాయులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. మామూలు ప్రైవేట్ పాఠశాలల్లో కూడా కనీస వేతనం అమలు చేయడం లేదు. ఉపాధ్యాయులకు కనీసం 18 వేలు ఉండగా,ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు కనీసం 10 వేలు కూడా వేతనం ఇవ్వడం లేదు.కొన్ని పాఠశాలల్లో బిఇడి, టిటిసి చేసిన ఉపాధ్యాయులకు రూ. 5 వేలు ఇస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలాది రూపాయలు దోపిడి చేస్తున్న యాజమాన్యాలు ఉపాధ్యాయులకు కూడా సరైన వేతనాలు ఇవ్వడం లేదు. ప్రైవేట్ ఫీజుల నియంత్రణపై అధికారులు పర్యవేక్షణ ఉండాల్సి ఉన్నా ఎక్కడా అమలు కావడం లేదు.

అధికారుల పర్యవేక్షణ లేదు:
ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ లేక పోవడంతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఆ శాఖ అధికారులకు యాజమాన్యాలు మామూళ్లు ఇస్తుండడంతో కిమ్మనడం లేదు.పాఠశాలల రెనివల్ సమయంలోనూ, కొత్త పాఠశాలల అనుమతులలో పెద్ద ఎత్తున మామూళ్లు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. డిఇఓ శాఖలో పని చేసే ఒక కింది స్థాయి అధికారి పాఠశాలల అనుమతుల విషయంలో పెద్ద లాబింగ్‌కు పాల్పడుతున్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సీజన్‌లో విచ్చల విడిగా డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు వ్యక్తం అవుత్నునాయి. మండల విద్యాధికారులు కూడా ప్రైవేట్ పాఠశాలల తనఖీలకు రాకుండా ఉండేందుకు మామూళ్లు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.

ప్రభుత్వ పాఠశాలలే ముద్దు:
ప్రైవేట్ పాఠశాలల కంటే ఇప్పడు ప్రభుత్వ పాఠశాలలు ముద్దుగా ఉంటున్నాయి.అనేక మంది నేతలు,రాజకీయ నేతలు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు వంటి వారందరూ ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారే. కాని ప్రజలు ఇంగ్లీష్ మోజులో పడి పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించి జేబులు గుళ్ల చేసుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాల్లో ఇప్పడు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటున్నాయి.ప్రతి ఉపాధ్యాయులు నిర్నీత సమయానికి హాజరు అయ్యేలా బయోమెట్రిక్ విధానం అమల్లో ఉంది. దీంతో ఏ ఉపాద్యాయులు విధులకు హాజరయ్యింది. డుమ్మా కొట్టింది ఇట్టే తెలిసిపోయే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎంతో కష్టపడి చదవి, పోటీలో నెగ్గి ఉపాధ్యాయులగా వస్తారు. వీరు చెప్పే చదువులో కూడా నాణ్యత ఉంటుంది. విద్యార్థుల తల్లిదండ్రలు ప్రైవేట్ బడులపై ఉన్న ప్రేమ ప్రభుత్వ పాఠశాలలపై చూపించాలి. అదే విధంగా ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడిని అరికట్టాల్సిన అవసరం ఉందని తల్లిదడ్రులు కోరుతున్నారు.

Related Stories: