ప్రేమలో కొత్త కోణం

Masakalli

కొన్ని కథలు విని నమ్ముతాం. కొన్ని కథలు చూసి నమ్ము తాం. మరికొన్ని కథలు చూసి నా నమ్మలేని విధంగా ఉం టాయి. అలాంటిదే తన కథ అం టూ ఓ కుర్రాడి యాంగిల్‌లో చెప్పబోతున్న సినిమా ‘మసక్కలి’. ఇప్పటివరకు చూడని విధంగా ఓ సైకలాజికల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా ఈనెల 13న విడుదల చేయబోతున్నారు. హీరో సాయి రోనక్, హీరోయిన్‌లు శ్రావ్య, శిరీషల పాత్ర లు యూత్‌కి బాగా కనెక్ట్ అవుతాయ ని సినిమా యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా నిర్మాత నమిత్ సింగ్ మాట్లాడుతూ “సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. యూత్‌ఫుల్ లవ్‌లో కొత్త కోణాన్ని చూపించడంలో దర్శకుడు నబి యేనుగుబాల సక్సెస్ అయ్యారు. యువతను ఆకట్టుకునే అంశాలతో పాటు ఒక కొత్త పాయింట్‌ను ఈ సినిమాలో చర్చించాం. చిత్ర కథనం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది”అని అన్నారు.