ప్రియురాలు మాట్లాడటం లేదని ప్రియుడి ఆత్మహత్య…

పేట్‌బషీరాబాద్: తాను ప్రేమించిన యువతి… తనతో మాట్లాడటం… ఫోన్‌లో కూడా స్పందించడం లేదని సూసైడ్ నోట్ రాసి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుండ్లపోచంపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య కుమారుడు జగన్ గణేష్ (21) దిల్‌సుఖ్‌నగర్‌లో ఓ కళాశాలలో సిఎ చదువుతున్నాడు. ఇటీవల పరీక్షలు పూర్తి కావడంలో స్వగ్రామానికి వచ్చాడు. ఇదే గ్రామానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. వారు […]

పేట్‌బషీరాబాద్: తాను ప్రేమించిన యువతి… తనతో మాట్లాడటం… ఫోన్‌లో కూడా స్పందించడం లేదని సూసైడ్ నోట్ రాసి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుండ్లపోచంపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య కుమారుడు జగన్ గణేష్ (21) దిల్‌సుఖ్‌నగర్‌లో ఓ కళాశాలలో సిఎ చదువుతున్నాడు. ఇటీవల పరీక్షలు పూర్తి కావడంలో స్వగ్రామానికి వచ్చాడు. ఇదే గ్రామానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. వారు తరుచుగా మాట్లాడుకుంటూ ఉండేవారు. ఇదే ప్రేమగా భావించిన యువకుడు ఆ యువతిని ప్రేమించాడు. అయితే గత కొంతకాలంగా యువతి గణేష్‌తో సరిగా మాట్లాడంలేదని, ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నిచాడు. యువతి మాట్లాడానికి నిరాకరించడంతో మనస్థాపానికి గురైన గణేష్ సూసైడ్ నోట్‌లో తాను ప్రేమించిన యువతి… ఫోన్‌లో కూడా మాట్లాడటం లేదని రాసి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.

Comments

comments

Related Stories: