ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ఆందోళన

 Girlfriend anxiety before the boyfriend house

రంగారెడ్డి: ప్రేమ పేరుతో  ఓ యువతిని ఓ యువకుడు మోసం చేసిన సంఘటన జిల్లాలోని షాబాద్ మండలం లక్ష్మారావుగూడ గ్రామంలో చోటు చేసుకుంది. దీంతో యువతి తనను మోసం చేశాడంటూ ప్రియుడి ఇంటి ముందు ఆందోళన చేపట్టింది. తనకు న్యాయం చేయాలని ప్రియుడి ఇంటి ముందు యువతి  భీష్మించుకొని కూర్చుంది.  ప్రియురాలు ఇంటికి వస్తుందన్న విషయం తెలుసుకున్న ప్రియుడు ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

comments