ప్రిన్సిపాల్ దాష్టీకం

విద్యార్థినిని చితకబాదిన వైనం మన తెలంగాణ/నేలకొండపల్లి: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని సింగారెడ్డిపాలెం తెలంగాణ సోషల్ గురుకుల బాలికల కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థినులపై కఠినంగా వ్యవహరిస్తోంది. తండ్రి తెచ్చిన రొట్టె తిన్నందుకు ఓ విద్యార్థినిని ప్రిన్సిపాల్ చితకబాదింది. బయటి వస్తువులు తింటే వారిని వారించాల్సిన ప్రిన్సిపాల్ చితకబాదడంతో తల్లిదండ్రులు ఆందోళనకు దిగిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న రోహిణికి వాంతులు, విరేచనాలు అవుతున్నట్లు తెలుసుకున్న తండ్రి నాగబాబు మందులు, బ్రెడ్ తీసుకుని […]

విద్యార్థినిని చితకబాదిన వైనం

మన తెలంగాణ/నేలకొండపల్లి: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని సింగారెడ్డిపాలెం తెలంగాణ సోషల్ గురుకుల బాలికల కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థినులపై కఠినంగా వ్యవహరిస్తోంది. తండ్రి తెచ్చిన రొట్టె తిన్నందుకు ఓ విద్యార్థినిని ప్రిన్సిపాల్ చితకబాదింది. బయటి వస్తువులు తింటే వారిని వారించాల్సిన ప్రిన్సిపాల్ చితకబాదడంతో తల్లిదండ్రులు ఆందోళనకు దిగిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న రోహిణికి వాంతులు, విరేచనాలు అవుతున్నట్లు తెలుసుకున్న తండ్రి నాగబాబు మందులు, బ్రెడ్ తీసుకుని వెళ్లారు. రొట్టె తిన్న విషయాన్ని తెలుసుకొన్న ప్రిన్సిపాల్ డి.వెంకటలక్ష్మి విద్యార్థినిని విచక్షణా రహితంగా కర్రతో 40 దెబ్బలు కొట్టింది. విషయం తెల్సుకున్న తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్ వెంకటలక్ష్మిని సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. వివరణ కోసం ప్రయత్నించగా ప్రిన్సిపాల్ అందుబాటులో లేరు.

Comments

comments

Related Stories: