ప్రాజెక్టు నిర్మాణాల వేగవంతానికి రూ.37వేల కోట్లు

రాష్ట్రఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మనతెలంగాణ/జగిత్యాల: ఎడారిగా మారిన పంట పొలాలకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేయాలనే ధృఢ సంకల్పంతో ప్రాజెక్టు నిర్మాణాల వేగం పెంచేందుకు ఈ సంవత్సరం రూ.37వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని కలికోటలో సూర మ్మ చెరువు రిజర్వాయర్ నిర్మాణ పనుల శంకుస్థాపన కా ర్యక్రమానికి మంత్రి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఏ ర్పాటు చేసిన సమావేశంలో మంత్రి రాజేందర్ […]

రాష్ట్రఆర్థిక మంత్రి ఈటల రాజేందర్

మనతెలంగాణ/జగిత్యాల: ఎడారిగా మారిన పంట పొలాలకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేయాలనే ధృఢ సంకల్పంతో ప్రాజెక్టు నిర్మాణాల వేగం పెంచేందుకు ఈ సంవత్సరం రూ.37వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని కలికోటలో సూర మ్మ చెరువు రిజర్వాయర్ నిర్మాణ పనుల శంకుస్థాపన కా ర్యక్రమానికి మంత్రి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఏ ర్పాటు చేసిన సమావేశంలో మంత్రి రాజేందర్ మాట్లాడు తూ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ది చేసేందుకు టి ఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.57 ఏళ్ల ఆంధ్ర పా లకుల ఏలుబడిలో గ్రామాలకు వచ్చిన అభివృద్ధి నిధుల కంటే ఈ నాలుగేళ్ల్లలో తమ ప్రభుత్వం ఇచ్చిన నిధులే అధికంగా ఉన్నాయన్నారు.ఆనాడు కురస పార్టీలు,స్వార్థపూరిత పార్టీలు ఎన్నికల కోసమే టిఆర్‌ఎస్ తెలంగాణ ఉద్య మం చేపట్టిందని పిచ్చి కూతలు కూసారని,అయితే తమ ఉ ద్యమం ఎన్నికల కోసం, అధికారం కోసం కాదని దగా పడ్డ తెలంగాణ ప్రజల బతుకులు బాగు చేసేందుకేనని చెప్పామన్నారు.ఆనాడు చెప్పినట్లుగానే తెలంగాణ ప్రజల జీవన స్థి తిగతులను మార్చేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తోందన్నారు.ఆడ బిడ్డ కుటుంబానికి భారం కాదని, ఆడబిడ్డ పుడితే లక్ష్మీ అని నిరూపించేందుకు కళ్యాణలక్ష్మీ పథకం పెట్టి రూ.1,00,116 కట్నంగా అందిస్తున్నామన్నారు. ఈ నాలుగేళ్ళలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలే ప్రభుత్వ నిబద్దతకు నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. పరిగె ఏరుకుంటే కడుపు నిండదని… పంట పండితేనే కడుపు నిండుతుందన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న నెలకు రూ.1000 పెన్షన్, రేషన్ బియ్యం, కళ్యాణలక్ష్మీ తదితర పథకాలు శాశ్వతం పరిష్కారం కాదని, ప్రాజెక్ట్‌ల నిర్మాణం చేపట్టి ప్రతి గుంటకు సాగు నీరందిస్తేనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ది చెందుతుందని భావించిన ముఖ్యమంత్రి కెసిఆర్ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రాజెక్ట్‌లు చేపట్టగా వాటిని వేగవంతంగా పూర్తి చేసేందుకు మంత్రి హరీష్‌రావు అలుపెరగకుండా పని చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎస్సారెస్పీ కట్టేందుకు 20 నుంచి 30 ఏళ్ళు పట్టిందని, చివరి ఆయకట్టుకు నీరందించేందుకు 50 ఏళ్ళ కాలం పట్టిందన్నారు. అదే తెలంగాణ ప్రభుత్వం మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం, తుపాకులగూడెం, సీతారామ ప్రాజెక్ట్‌లను త్వరితగతిన పూర్తి చేసి లక్షల ఎకరాలకు సాగు నీరందించే గొప్ప యజ్ఞం చేపట్టిందన్నారు. ప్రపంచంలోనే గొప్పగా ప్రాజెక్ట్‌లు కట్టే దేశంగా చైనా పేరు సంపాదించుకోగా అంతకంటే వేగంగా తెలంగాణలో ప్రాజెక్ట్‌ల నిర్మాణం చేపట్టి పూర్తి చేస్తున్నామన్నారు.
దేశ చరిత్రలో వ్యవసాయం కోసం, నీళ్ళ కోసం వేల కోట్లు ఖర్చు పెట్టిన రాష్ట్రం దేశంలో తెలంగాణ తప్పా ఏది లేదన్నారు. ప్రపంచంలో ఇంత తక్కువ జనాభాకు ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టిన రాష్ట్రం ఏది లేదన్నారు. ప్రాజెక్ట్‌ల నిర్మాణం ఏడాదికి 25 వేల కోట్లు ఖర్చు పెట్టామని, అయితే ఈ సంవత్సరం ప్రాజెక్ట్‌ల నిర్మాణాల్లో మరింత వేగం పెంచేందుకు 37 వేల కోట్లు కేటాయించామన్నారు. ఈ ప్రాజెక్ట్‌ల నిర్మాణంతో ఏడారిగా మారిన పంట పొలాలన్నీ సస్యశ్యామలమవుతాయన్నారు.
సూరమ్మ రిజర్వాయర్ పనులను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి మేడిపల్లి, కథలాపూర్ తదితర మండలాలకు సాగునీరు అందించి ఈ ప్రాంత వాసులు వలసలు పోకుండా నిరోధిస్తామన్నారు.

Related Stories: