ప్రాజెక్టుల బాట

పెండింగ్ ప్రాజెక్టులపై ఏకమైన ప్రతిపక్షాలు

హర్షిస్తున్న పాలమూరు ప్రజలు
పూర్తయితే 8 లక్షల ఎకరాలకు సాగునీరు

జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలు సాగునీటి ప్రాజెక్టుల బాట పట్టాయి. జూన్ 11న భూత్పూర్ మండలం కర్వెన గ్రామంలో పాలమూరు ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పైలాన్‌ను ఆవిష్కరించిన నాటి నుంచి జిల్లా రాజకీయాలన్ని ప్రాజెక్టులపైనే తిరుగుతున్నాయి.

25gdl10-10మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలు సాగునీటి ప్రాజెక్టుల బాట పట్టా రు. జూన్ మాసం 11న భూత్పూర్ మండలం కర్వెన గ్రా మంలో పాలమూరు ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు పైలాన్‌ను ఆవిష్కరించిన నాటి నుంచి జిల్లా రాజకీయాలన్ని ప్రాజెక్టులపైనే తిరుగుతు న్నా యి. బిజెపి సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి పెండింగ్ ప్రా జెక్టులను సందర్శించి ఇవి తుది దశలో ఉన్నాయని, ప్రభు త్వం వేయ్యికోట్లు కేటాయిస్తే సంవత్సరంలో ప్రాజెక్టులు పూర్తి కావడమే కాకుండా 8 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని వివరాలతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు.

ఈ తరుణంలోనే ఎపి సీఎం చంద్రబాబునా యు డు పాలమూరు ఎత్తిపోతల పథకంపై కేంద్రానికి లేఖ రాశా రంటూ అధికార పార్టీ బంద్‌కు పిలుపునివ్వడంతోపాటు జి ల్లాలో ఏ ప్రాజెక్టులను ఎవ్వరూ ఆపడానికి వీలు లేదని అ ఖిల పక్షాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర టిజెఎసి వైస్ చైర్మన్‌గా ఉన్న మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ను పాల మూరు ప్రాజెక్టుల పరిరక్షణ జెఎసి అధ్యక్షునిగా నియమిం చారు. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు జిల్లాలో ఏర్పా టు చేస్తున్న అఖిల పక్షానికి ముఖ్య అతిథిగా హాజరవుతూ టిడిపి పార్టీతోపాటు ఇతర పార్టీలను దుమ్మెత్తి పోస్తున్నారు. ఏ బాబులు అడ్డు వచ్చినా జిల్లా ప్రాజెక్టులను ఆపలేరని అ ఖిల పక్షం పేరుతో అధికార పార్టీ నేతలు జిల్లా అంతట స మావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రతిపక్షానికి చెందిన పార్టీలన్ని మూకుమ్మడిగా అధికార పార్టీపై ప్రాజెక్టులపై దా డికి దిగుతున్నారు.

నాగం అనంతరం టిడిపి, కాంగెస్, సిపి ఎం కి చెందిన నేతలు పెండింగ్ ప్రాజెక్టులను సందర్శిం చారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి వ్య తిరేకం కాదంటూనే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం 300 కోట్లతో ప్రాజెక్టులు పూర్తి అవుతా యని, అయితే ఎక్స్‌లేషన్ ప్రకారం సంవత్సరానికి రేట్ల పెరుగుదల కారణంగా జీఓ నెం.13 ప్రకారం వేయి కోట్ల తో జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయవచ్చని ప్రతి పక్ష పార్టీలకు చెందిన నేతలు అంటున్నారు. గతంలో కిరణ్‌కుమార్ సిఎంగా ఉన్న సమయంలో ఈ జీఓను విడు దల చేశారని ఇప్పుడున్న ప్రాజెక్టుల అంచనాల ప్రకారం వేయి కోట్లతో పూర్తవుతాయని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు పేర్కొంటున్నారు.

వెంటనే నిధులు విడుదల చేసి ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల విమర్శలను తిప్పికొ డుతూ అధికార పార్టీ నేతలు మాట్లాడుతూ ప్రాజక్టులు పూ ర్తి కాకపోవడానికి కారణం గతంలో పాలించిన పార్టీలదే ఈ పాపమని ఆరోపిస్తున్నారు. గతంలో పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన పార్టీలు ఆనాడు పూర్తి చేయకుండా నే డు తమ పార్టీని విమర్శించడం తగదన్నారు. అంతే కాక కొ ందరు జిల్లాను దత్తత తీసుకున్న నేతలు నేడు అదే జిల్లాకు దగా చేస్తున్నారని వారు విమర్శించారు. పాలమూరు ఎత్తి పోతల పథకంతోపాటు పెండింగ్ ప్రాజెక్టులను కూడా పూ ర్తి చేసి 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు వాటర్‌గ్రిడ్ ద్వారా జిల్లాకు తాగునీరు అందిస్తామని అధికార పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
చేస్తున్న అభివృద్ధి పనులను ఓర్వలేక ప్రాజెక్టుల బాట పట్టారని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. అయితే జిల్లాలోని ఎత్తిపోతల పథకానికి 2005లో జలయజ్ఞంలో భాగంగా నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా ప్రాజెక్టుల ఎ త్తిపోతల పథకానికి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్. రాజ శేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు ప్రాజెక్టులపై 7,071.67 కోట్ల రూపాయలు ఖర్చుకాగా నెట్టెంపాడుపై రూ.1825.82 కోట్లు, భీమా ప్రాజెక్టుపై రూ.2005.97 కో ట్లు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకంపై రూ.2837.62 కోట్లు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకంపై రూ. 402.26 కోట్లు ఖర్ఛు అయ్యాయి.

ఇవి దాదాపుగా తుది దశలో ఉన్నాయి. ఈ దశలో పెండింగ్ ప్రాజెక్టులపై ప్రతిపక్షాలు ఏకం కావ డం అధికార పార్టీకి కూడా ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇస్తుండడంతో జిల్లా ప్రాజెక్టులు పూర్తి అయితే కరు వును శాశ్వతంగా జిల్లా నుంచి తరిమివేయడం జరుగుతుం దని జిల్లా ప్రజలు చర్చించుకోవడంతోపాటు సంతోషం వ్య క్తం చేస్తున్నారు. ఎప్పుడూ కూడా పార్టీలు జిల్లాలో ఏకమైన సందర్భాలు లేవని ఏదీ ఏమైనా జిల్లా ప్రాజెక్టులపై అని పా ర్టీలు ఒకే మాట పలుకడాన్ని జిల్లా ప్రజలు స్వాగతి స్తున్నారు.

Comments

comments