ప్రాజెక్టులకు జలకళ

Flood Water to Projects

భద్రాద్రి కొత్తగూడెం : మూడు రోజులుగా భారీ వర్షాలు పడుతుండడంతో సాగునీటి ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. భారీ వర్షాళతో గోదావరి, ప్రాణహిత నదులు పొంగిపొర్లుతున్నాయి. చర్ల మండలం తాలిపే ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. తాలిపేరు పూర్తి స్థాయి నీటి మట్టం 74 మీటర్లు. ప్రస్తుత నీటి మట్టం 72.50మీటర్లుగా ఉంది. ఇన్‌ఫ్లో 3700క్యూసెక్కులుగా ఉ౮ంది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెర ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. భారీ వర్షాలతో కుంతాల ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. పెన్‌గంగ సైతం పొంగిపొర్లుతోంది.

Flood Water to Projects