ప్రముఖ బెంగాలీ నటి బలవన్మరణం..!

Bengali actor Payel Chakraborty found dead in hotel room

బెంగాలీ ప్రముఖ నటి పాయల్ చక్రవర్తి (36) ఓ హోటల్‌లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గ్యాంగ్‌టక్ వెళ్లేందుకుగాను పాయల్ మంగళవారం సిలిగురి వచ్చి ఓ హోటల్‌లో దిగింది. ఆ రోజు రాత్రి భోజనం కూడా చేయకుండా అలాగే గదిలోనే ఉంది. అయితే, బుధవారం పొద్దెక్కిన కూడా ఆమె బయటకు రాలేదు. దీంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది ఆమె గది తలుపు బద్దలుగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దాంతో హోటల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పాయల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పాయల్ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించగా, పోస్టుమార్టం తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. భర్తతో మనస్పర్థల కారణంగా ఇటీవల విడాకులు తీసుకున్నారని తెలిసింది. దీంతో తన కొడుకుతో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. కాగా, పాయల్ మృతిపై ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాయల్ ఆత్మహత్యతో బెంగాలీ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.

Comments

comments