ప్రమాదవశాత్తు కార్మికుడు మృతి…

Accidental building construction worker killed
మాదాపూర్: ప్రమాదవశాత్తు భవన నిర్మాణ కార్మికుడు మొదటి అంతస్తునుంచి కిందపడి మృతి చెందిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీలు తెలిపిన వివరాల ప్రకారం… ఒరిస్సా రాష్ట్రం, కోరాపూర్ జిల్లాకు చెందిన షాదన్ (27) బ్రతుకుదేరువు నిమిత్తం హైదరాబాద్ కు వలస వచ్చి మాదాపూర్‌లోని పత్రిక నగర్‌లో నివాసం ఉంటూ.. భవన నిర్మాణ కార్మికునిగా పని చేస్తున్నడు. ఆదివారం సాయంత్రం సమయంలో పని చేస్తున్న భవనం మొదటి అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కింద పడడంతో తలకు బలమయిన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘన స్థలానికి చేరుకోని శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Comments

comments